పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సూర్యవంశారంభము

  •  
  •  
  •  

9-6-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుము, మనువుకులము వేయి నూఱేండ్లును
రఁగ విస్తరించి లుకరాదు,
నాకుఁ దోచినంత రనాథ! వేగంబ
యెఱుకపడఁగఁ బ్రీతి నేర్పరింతు.

టీకా:

వినుము = వినుము; మనువు = మనువుయొక్క; కులము = వంశవృత్తాతంము; వేయినూఱు = నూరువేల; ఏండ్లును = సంవత్సరములైనను; పరగ = నడపినను; విస్తరించి = వివరించి; పలుకరాదు = చెప్పుటసాధ్యముకాదు; నాకున్ = నాకు; తోచిన = తట్టిన; అంత = వరకు; నరనాథ = రాజా {నరనాథుడు - నరులకు ప్రభువు, రాజు}; వేగంబ = శీఘ్రముగ; ఎఱుకపడగన్ = తెలియునట్లు; ప్రీతిన్ = ప్రేమతో; ఏర్పరింతు = తెలిపెదను.

భావము:

“రాజా! శ్రద్ధగా వినుము. మనువుయొక్క వంశవృత్తాంత మంతా నూరువేల సంవత్సరములు ఐనా చెప్పుట సాధ్యము కాదు. నాకు తోచినంత వరకు తెలిపెదను.