పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సూర్యవంశారంభము

  •  
  •  
  •  

9-3.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దురు గొడుకులు గల రండ్రు, రఁగ వారి
వంశ మేరీతి వర్తించె? వారిలోనఁ
నినవారిని, జనువారిఁ, నెడువారిఁ
జెప్పవే వ్యాసనందన! చిత్తగించి.

టీకా:

మనువుల = చతుర్దశమనువుల {చతుర్దశమనువులు - 1స్వాయంభువ 2స్వారోచిష 3ఉత్తమ 4తామస 5రేవత 6చాక్షుస 7వైవస్వత (ప్రస్తుతమనువు) 8సూర్యసావర్ణిక 9దక్షసావర్ణిక 10బ్రహ్మసావర్ణిక 11రుద్రసావర్ణిక 12దర్మసావర్ణిక 13రౌచ్య 14భౌమ్యులు}; నడవళ్ళు = నడవడికలు; మర్యాదలును = యశస్సులు; వింటి = విన్నాను; మన్వంతరంబున = మన్వంతరములలో; మాధవుండు = విష్ణుమూర్తి {మాధవుడు - లక్ష్మీదేవికి భర్త, విష్ణువు}; తిరిగిన = సంచరించిన; జాడలున్ = వివరములు; తెలిసెన్ = తెలిసినవి; సత్యవ్రతుఁడు = సత్యవ్రతుడు; అను = అనెడి; రాజు = రాజు; ద్రవిళ = ద్రావిడ; దేశ = రాజ్యమునకు; అధిపుండు = రాజు; పోయిన = గడచిపోయినట్టి; కల్పాంతమునన్ = కల్పముచివరలో; విష్ణున్ = విష్ణుమూర్తిని {విష్ణువు - విశ్వమున వ్యాపించి యుండువాడు, హరి}; సేవించి = కొలిచి; విజ్ఞానమునున్ = తత్త్వమును; పొంది = తెలిసికొని; వెలుఁగుఱేని = సూర్యునికి; అతఁడు = అతను; వైవస్వతుండు = వైవస్వతుడు; ఐ = అనెడి పేరుగలవాడై; పుట్టి = జన్మించి; మనువు = మనువు; అయ్యెన్ = అయ్యెను; అతని = వాని; కిన్ = కి; ఇక్ష్వాకుడు = ఇక్ష్వాకుడు; ఆదిగాగ = మున్నగువారు; పదురు = పదిమంది; కొడుకులు = పుత్రులు; కలరు = ఉన్నారు; అండ్రు = అనెదరు;
పరగ = ప్రసిద్దమైన; వారి = వారియొక్క; వంశము = వంశము; ఏరీతి = ఎలా; వర్తించె = గడచినది; వారి = వారి; లోనన్ = అందు; చనినవారినిన్ = పూర్వులను; చను = ప్రస్థుతపు; వారిన్ = వారిని; చనెడు = పుట్టబోవు; వారిన్ = వారిని; చెప్పవే = చెప్పుము; వ్యాసనందవ = శుకుడా {వ్యాసనందనుడు - వ్యాసుని కొడుకు, శుకుడు}; చిత్తగించి = దయచేసి.

భావము:

“శుకమహర్షి! 1స్వాయంభువ 2స్వారోచిష 3ఉత్తమ 4తామస 5రేవత 6చాక్షుస 7వైవస్వత (ప్రస్తుతమనువు) 8సూర్యసావర్ణిక 9దక్షసావర్ణిక 10బ్రహ్మసావర్ణిక 11రుద్రసావర్ణిక 12దర్మసావర్ణిక 13రౌచ్య 14భౌమ్యులు అనె చతుర్దశమనువుల నడవడికలు యశస్సులు విన్నాను. ఆయా మన్వంతరములలో మాధవుడు సంచరించిన వివరములు తెలిసినవి. సత్యవ్రతుడు అనే రాజు ద్రావిడ రాజ్యమునకు రాజు గడచిపోయినట్టి కల్పము చివరలో విష్ణుమూర్తిని కొలిచి తత్త్వమును తెలిసికొన్నాడు. సూర్యునికి అతను వైవస్వతుడు అనే పేరుతో జన్మించి మనువు అయ్యాడు. వానికి ఇక్ష్వాకుడు మున్నగువారు పదిమంది పుత్రులు పుట్టారు కదా. ప్రసిద్దమైన వారి వంశము ఎలా గడచినది. వారిలో పూర్వులను, ప్రస్తుతపు వారిని, పుట్టబోవు వారిని దయచేసి చెప్పుము.