పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భగీరథుని చరితంబు

  •  
  •  
  •  

9-229-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్తవత్సలుండు ఫాలాక్షుఁ డా భగీ
థుని మెచ్చి నిజ శిరంబునందు
శౌరిపాదపూత లిల మై దివి నుండి
రకు వచ్చు గంగఁ దాల్చె నపుడు.

టీకా:

భక్త = భక్తులకు; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; ఫాలాక్షుడు = పరమశివుడు {ఫాలాక్షుడు - ఫాలమున (నుదుట) అక్షుడు (కన్నుగలవాడు), శంకరుడు}; ఆ = ఆ; భగీరథుని = భగీరథుని; మెచ్చి = మెచ్చుకొని; నిజ = తనయొక్క; శిరంబున్ = తల; అందున్ = పైన; శౌరి = విష్ణుని {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; పాద = పాదములనుసోకి; పూత = పవిత్రమైన; సలిలము = జలము; ఐ = అయ్యి; దివి = ఆకాశము; నుండి = నుండి; ధర = భూమి; కున్ = కి; వచ్చు = వచ్చెడి; గంగన్ = దేవ గంగను; తాల్చెన్ = ధరించెను; అపుడు = అప్పుడు.

భావము:

భక్తవత్సలుడు ఫాలాక్షుడు భగీరథుని మెచ్చుకొని ఆకాశం నుండి భూలోకాన అవతరించ వచ్చే విష్ణుపాది అయిన గంగను తన తల మీద దర్శిస్తాను అని వరం ఇచ్చాడు. అప్పుడు...