పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భగీరథుని చరితంబు

  •  
  •  
  •  

9-227-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లో నిన్ని జగంబులుం గలుగుటం దా నిన్నిటం గల్గుటన్
నీ! తంతువులందుఁ జీర గల యా చందంబునన్ విశ్వభా
నుఁడై యొప్పు శివుండు గాక మఱి నీ వారిన్ నివారింప నే
ర్చి వారెవ్వరు? నిన్ ధరించుకొఱకై శ్రీకంఠునిం గొల్చెదన్."

టీకా:

తన = తన; లోనన్ = అందు; ఇన్ని = సమస్తమైన; జగంబులున్ = భువనములు; కలుగుటన్ = ఉండుటచేత; తాన్ = అతను; అన్నిటన్ = సమస్తమందు; కల్గుటన్ = ఉండుటచేత; జననీ = అమ్మా; తంతువులు = దారముల; అందున్ = లో; చీర = వస్త్రమువలె; కల = ఉన్న; ఆ = ఆ; చందంబునన్ = విధముగ; విశ్వ = భువనములను; భావనుడు = రచించువాడు; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; శివుండు = పరమశివుడు; కాక = తప్పించి; మఱి = మరింకొకరు; నీ = నీయొక్క; వారిన్ = వేగమును; నివారింపన్ = ఆపుట; నేర్చిన = చేయగలిగిన; వారు = వారు; ఎవ్వరు = ఎవరున్నారు; నిన్ = నిన్ను; ధరించు = ధరించుట; కొఱకై = కోసము; శ్రీకంఠుని = పరమశివుని {శ్రీకంఠుడు - వ్యు. శ్రీ కఠే అస్య, బ.వ్రీ., కంఠమున వన్నెకలవాడు, శివుడు}; కొల్చెదన్ = సేవించెదను.

భావము:

అమ్మా! పరమ శివుడు తనలో సకల భువనములు కలవాడు, సమస్తమందు తాను ఉంటాడు, దారములలో వస్త్రమువలె, సకల జగత్తులను రచిస్తుంటాడు. ఆయన తప్పించి మరింకెవరు నీ వేగాన్ని తట్టుకొనలేరు. అందుచేత నిన్ను ధరించుట కోసం శ్రీకంఠుడిని సేవిస్తాను.”