పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-218-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని కొడుకు దిలీపుఁడు
భూలమున గంగ దెచ్చి పొందించుటకై
ప్రీతిం దపంబు చేయుచు
భాతిగఁ దేలేక కాలరవశుఁ డయ్యెన్.

టీకా:

అతని = అతనియొక్క; కొడుకు = పుత్రుడు; దిలీపుడు = దిలీపుడు; భూతలమునన్ = భూమండలమునకు; గంగన్ = గంగను; తెచ్చి = తీసుకొచ్చుట; పొందించుట = సాధించుట; కై = కోసము; ప్రీతిన్ = కోరి; తపంబున్ = తపస్సు; చేయుచున్ = చేసినను; భాతిగన్ = ప్రకాశముగ; తేలేక = తీసుకురాలేక; కాలపరవశుడు = మరణించినవాడు {కాలపరవశుడు - కాలప్రభావమునకు లోనైనవాడు, మరణించినవాడి}; అయ్యెన్ = అయ్యెను.

భావము:

అతని కొడుడు దిలీపుడు కోరి తపస్సు చేసాడు. కాని భూలోకానికి గంగను తీసుకురాకుండానే మరణించాడు.