పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-217-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కులు మ్రగ్గినచోటికి
నిమిషనదిఁ దెత్తు ననుచు టవీస్థలికిం
ని తపము చేయఁ జాలక
మున వగ లొలయ నంశుమంతుఁడు దీఱెన్.

టీకా:

జనకులు = తండ్రులు; మ్రగ్గిన = చచ్చిపోయిన; చోటు = స్థలమున; కిన్ = కు; అనిమిషనదిన్ = దేవనది, గంగను {అనిమిషనది - అనిమిష(దేవతా) నది, గంగ}; తెత్తును = తీసుకొచ్చెదను; అనుచున్ = అంటు; అటవీ = అడవి; స్థలి = ప్రదేశమున; కిన్ = కు; చని = వెళ్ళి; తపమున్ = తపస్సు; చేయన్ = ఆచరించ; చాలక = లేక; మనమునన్ = మనసునందు; వగలు = దిగుళ్ళు; ఒలయన్ = కలుగుతుండగా; అంశుమంతుడు = అంశుమంతుడు; తీఱెన్ = మరణించెను.

భావము:

అంశుమంతుడు తండ్రులు మరణించిన చోటుకి దేవనదిని తీసుకు రావడానికి అడవికి వెళ్ళాడు. తపస్సు ఆచరించ లేక దిగులుపడి మరణించాడు.