పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-216-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన నమస్కరించి, తురంగంబుఁ గొనివచ్చి, యా సగరుని కిచ్చిన సగరు డా పశువువలన జన్నంబు కడమ నిండించి యంశుమంతునకు రాజ్యంబిచ్చి, ముక్తబంధనుండై, యౌర్వుండు చెప్పిన మార్గంబున నుత్తమ గతికిం జనియె; నంత.

టీకా:

అని = అని; పలికిన = చెప్పగ; నమస్కరించి = నమస్కారముచేసి; తురగంబున్ = గుఱ్ఱమును; కొనివచ్చి = తీసుకొని వచ్చి; ఆ = ఆ; సగరున్ = సగరుని; కిన్ = కి; ఇచ్చినన్ = ఇవ్వగా; సగరుడు = సగరుడు; ఆ = ఆ; పశువు = బలిపశువు; వలన = తోటి; జన్నంబున్ = యజ్ఞము; కడమ = మిగిలినదానిని; నిండించి = పూర్తిచేసి; అంశుమంతున్ = అంశుమంతుని; కున్ = కి; రాజ్యంబున్ = రాజ్యమును; ఇచ్చి = ఇచ్చేసి; ముక్త = తెంచుకొన్న; బంధనుండు = బంధములు కలవాడు; ఐ = అయ్యి; ఔర్వుండు = ఔర్వుడు; చెప్పినన్ = తెలిపినట్టి; మార్గంబునన్ = దారిలో; ఉత్తమగతి = మోక్షమున; కున్ = కు; చనియెను = చేరెను; అంత = అంతట.

భావము:

అని అనుగ్రహించిన కపిలునికి నమస్కారము చేసి, అంశుమంతుడు గుఱ్ఱాన్ని తీసుకు వచ్చి తాత సగరునికి ఇచ్చాడు. సగరుడు మిగిలిన యజ్ఞం పూర్తిచేసాడు. అంశుమంతునికి రాజ్యం ఇచ్చి, సంసార బంధాలు తెంచుకుని, ఔర్వుడు చెప్పిన దారిలో వెళ్శి మోక్షం పొందాడు. అంతట....