పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-214-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వినుతి చేయుచు, హయంబు విడువు మని చెప్పక తన తండ్రులు నీఱగుటం దడవక, మ్రొక్కి నిలుచున్న యంశుమంతునికిఁ గరుణావిపులుం డగు కపిలుం డిట్లనియె.

టీకా:

అని = అని; వినుతి = స్తుతించుట; చేయుచున్ = చేస్తూ; హయంబున్ = గుఱ్ఱమును; విడువుము = విడిచిపెట్టుము; అని = అని; చెప్పక = చెప్పకుండ; తన = తనయొక్క; తండ్రులు = తండ్రులు; నీఱు = బూడిద; అగుటన్ = ఐపోయినందుకు; తడవక = ప్రస్తావించకుండ; మ్రొక్కి = నమస్కరించి; నిలుచున్న = నిలబడియున్న; అంశుమంతున్ = అంశుమంతుని; కిన్ = కి; కరుణావిపులుండు = దయామయుడు; అగు = ఐన; కపిలుండు = కపిలుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని స్తుతిస్తూ, గుఱ్ఱం విడిచిపెట్టమని కాని, తన బూడిద ఐన తండ్రులను కాని ప్రస్తావించకుండ తనకు నమస్కరించి నిలబడి ఉన్న అంశుమంతుని చూసి దయామయుడు ఐన కపిలుడు ఇలా అన్నాడు.