పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-211-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుస నయోధ్యలోనఁ గలవారల నాడెడు పిన్నవాండ్ర నా
యువులోనఁ వైచి జనసంఘముఁ దండ్రియుఁ దిట్టుచుండ వాఁ
డురుమతిఁ గొన్ని ప్రొద్దులకు యోగబలంబునఁ జేసి బాలురం
దిరిగి పురంబు లోపలికిఁ దెచ్చిన నివ్వెఱఁ గంది రందఱున్.

టీకా:

వరుసన్ = వరసగా; అయోధ్య = అయోధ్య; లోనన్ = అందు; కల = ఉన్నట్టి; వారలన్ = వారిని; ఆడెడు = ఆడుకొనుచున్న; పిన్నవాండ్రన్ = పిల్లవాళ్ళని; ఆ = ఆ; సరయువు = సరయువునది; లోనన్ = లోనికి; వైచి = పడవేసి; జన = లోకుల; సంఘమున్ = సమూహము; తండ్రియున్ = తండ్రి; తిట్టుచుండన్ = తిడితుండగ; వాడు = వాడు; ఉరు = గొప్ప; బుద్ధిన్ = తెలివితేటలతో; కొన్ని = కొద్ది; ప్రొద్దుల్ = దినముల; కున్ = కు; యోగబలంబునన్ = యోగశక్తి; చేసి = చేత; బాలురన్ = పిల్లలను; తిరిగి = వెనక్కి; పురంబు = నగరము; లోపలి = లోని; కిన్ = కి; తెచ్చినన్ = తీసుకురాగా; నివ్వెఱగు = ఆశ్ఛర్యమును; అందిరి = పొందిరి; అందఱున్ = అందరు.

భావము:

అయోధ్యలో ఆడుకుంటున్న పిల్లలను అందరిని అసమంజసుడు సరయునదిలో పడవేసాడు. లోకులు, తండ్రి అందరూ తిట్టసాగారు. అందరు.ఆశ్ఛర్యపోయేలా, మహా ఙ్ఞాని అయిన ఆయన కొన్నాళ్ళ పిమ్మట తన యోగశక్తితో పిల్లలను అందరిని బ్రతికించి వెనక్కి నగరానికి లోనికి తీసుకు వచ్చాడు.