పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-207-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఱిఁగితి మద్దిరయ్య తడవేటికి? గుఱ్ఱపుదొంగ చిక్కె; నీ
భుని బట్టి చంపుఁ; డతిసాధుమునీంద్రుఁడుఁబోలె నేత్రము
ల్దెవక బాకినోరు మెదలింపక బైసుక పట్టె' నంచు న
య్యఱువది వేవురున్ నిజకరాయుధముల్ జళిపించి డాయుచోన్.

టీకా:

ఎఱిగితిమి = తెలిసికొన్నాము; అద్దిరయ్య = భళీ; తడవు = ఆలసించుట; ఏటికి = దేనికి; గుఱ్ఱపు = గుఱ్ఱం; దొంగ = దొంగ; చిక్కెన్ = దొరికెను; ఈ = ఈ; జఱభుని = రంకులాడును; పట్టి = పట్టుకొని; చంపుడు = సంహరించండి; అతి = మిక్కిలి; సాధు = సజ్జనుడైన; ముని = మునులలో; ఇంద్రుడున్ = శ్రేష్ఠుని; పోలెన్ = వలె; నేత్రముల్ = కళ్ళు; తెఱవక = తెరవకుండ; బాకి = పెద్ద; నోరు = నోటిని; మెదలింపక = మెదపకుండ; బైసుకన్ = ప్రతిజ్ఞ, పంతము; పట్టెను = పట్టెను; అంచున్ = అనుచు; ఆ = ఆ; అఱువదివేవురున్ = అరవైవేలమంది(60000); నిజ = తమ; కరా = చేతులలోని; ఆయుధముల్ = కత్తులను; జళిపించి = ఆడించి; డాయుచోన్ = దగ్గరౌతుండగ.

భావము:

వారు “భలే భలే గుఱ్ఱం దొంగ దొరికేసాడు. ఇంకా ఆలస్యం చేయడం దేనికి. దొంగను పట్టుకొని సంహరించండి.” అని అనుకున్నారు. వెంటనే ఆ అరవైవేలమంది(60000) తమ చేతులలోని కత్తులు ఆడిస్తూ కదలకుండా మెదలకుండ ఉన్న మిక్కిలి సజ్జనుడైన కపిలముని దగ్గరకు పోతుండగా....