పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సగరుని కథ

  •  
  •  
  •  

9-202-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దండించి పగవారు నభూమిఁ జేకొన్న-
నంగనలును దాను డవి కేఁగి
డవిలో ముసలియై యాతఁడు చచ్చిన-
నాతని భార్య దా నుగమింపఁ
దియుచో నా స్త్రీకి ర్భంబు గలుగుట-
యౌర్వమునీశ్వరుఁ డాత్మ నెఱిఁగి
వారించె; నంత నవ్వనజాక్షి సవతులు-
చూలు నిండారినఁ జూడఁ జాల

9-202.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థి నన్నంబు గుడుచుచో నందుఁ గలిపి
విషము పెట్టిరి; పెట్టిన విరిసి పడక
రముతోఁ గూడ సగరుండు నుఁడు పుట్టి
రయశస్ఫూర్తితోఁ జక్రర్తి యయ్యె.

టీకా:

దండించి = ఓడించి; పగవారు = శత్రువులు; తన = తనయొక్క; భూమిన్ = రాజ్యమును; చేకొన్నన్ = తీసుకొనగా; అంగనులునున్ = స్త్రీజనములు; తానున్ = తను; అడవి = అడవి; కిన్ = కి; ఏగి = వెళ్ళి; అడవి = అడవి; లోన్ = అందు; ముసలి = ముదుసలి; ఐ = అయ్యి; ఆతడున్ = అతడు; చచ్చినన్ = చనిపోగా; ఆతని = అతనియొక్క; భార్య = రాణి; తాన్ = తను; అనుగమింపన్ = సహగమనముచేయ; కదియుచోన్ = సిద్దపడుతుండగా; ఆ = ఆ; స్త్రీ = పడతి; కిన్ = కి; గర్భముగలుగుట = కడుపుతోనుండుట; ఔర్వ = ఔర్వుడు యనెడి; ముని = మునులలో; ఈశ్వరుడు = గొప్పవాడు; ఆత్మన్ = మనసులో; ఎఱిగి = తెలియుటచేత; వారించెన్ = ఆపెను; అంతన్ = అంతట; ఆ = ఆ; వనజాక్షి = సుందరి {వనజాక్షి - వనజ (పద్మముల) వంటి అక్షి (కన్నులు గలామె), అందగత్తె}; సవతులు = సపత్నులు; చూలునిండారినన్ = నవమాసములునిండగా; చూడజాలక = చూడలేక; అర్థిన్ = కావాలని; అన్నంబున్ = భోజనము; కుడుచుచోన్ = తినేటప్పుడు; అందున్ = దానిలో; కలిపి = కలిపేసి, చేర్చి.
విషమున్ = విషమును; పెట్టిరి = పెట్టిరి; పెట్టినన్ = అలా పెట్టినప్పటికి; విరిసి = విచ్చిన్నమై; పడకన్ = జారిపోక; గరము = విషము; తోగూడ = తోపాటు; సగరుండు = సగరుడు {సగరుడు - విషముతోపాటు పుట్టినవాడు}; ఘనుడు = గొప్పవాడు; పుట్టి = పుట్టి; వర = గొప్ప; యశస్ = కీర్తి; స్ఫూర్తితో = వహించి; చక్రవర్తి = సార్వభౌముడు; అయ్యెన్ = అయ్యెను.

భావము:

వృకుని కొడుకుని శత్రువులు ఓడించి రాజ్యం తీసేసుకున్నారు. అతను తన స్త్రీలతో అడవికి వెళ్ళి, ముదుసలి అయ్యి చనిపోయాడు. అతని రాణి సహగమనము చేయబోగా, ఆమె కడుపుతో ఉందని తెలిసిన ముని ఔర్వుడు ఆ ప్రయత్నం ఆపాడు. ఆ సుందరికి నవమాసములు నిండగా అసూయతో చూడలేని సపత్నులు, కావాలని విషాన్నం పెట్టారు. అలా విషం పెట్టినా గర్భం జారిపోలేదు. విషంతోపాటు సగరుడు పుట్టి, గొప్ప కీర్తి వహించి సార్వభౌముడు అయ్యాడు.