పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : హరిశ్చంద్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-199-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు మగిడించినం దిరిగి చని రోహితుం డొక్క యేఁ డవ్వనంబునం దిరిగి క్రమ్మఱఁ జనుదేర నింద్రుండు వచ్చి తొంటి యట్ల నివారించె; ఇవ్విధంబున.

టీకా:

అని = అని; ఇట్లు = ఇలా; మగిడించిన్ = మరలించగా; తిరిగి = మరలి; చని = పోయి; రోహితుండు = రోహితుడు; ఒక్క = ఇంకొక; ఏడు = సంవత్సరము; ఆ = ఆ; వనంబునన్ = అడవిలో; తిరిగి = మసలి; క్రమ్మఱన్ = మరల; చనుదేర = బయలుదేరగా; ఇంద్రుండు = ఇంద్రుడు; వచ్చి = వచ్చి; తొంటి = ఇంతకు ముందు; అట్లు = వలెనే; నివారించెన్ = ఆపెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

ఇలా ఇంద్రుడు మరలించగా ఆగిన రోహితుడు ఇంకొక సంవత్సరం అడవిలోనే మసలి మరల బయలుదేరాడు. ఇంద్రుడు మళ్ళీ వచ్చి ఇంతకు ముందులాగే ఆపాడు. ఇలా..