పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : హరిశ్చంద్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-197-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వనంబునకుఁ జని శరశరాసన ధరుండయి రోహితుండు దిరుగుచుండి వరుణగ్రస్తుండై హరిశ్చంద్రుండు మహోదరవ్యాధిచేఁ బీడితుండుగా నుండుట విని పురంబునకుం దిరిగిరా గమకింప నింద్రుండు ముసలి తపసియై వచ్చి నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వనంబున్ = అడవి; కున్ = కి; చని = వెళ్ళి; శరశరాసన = విల్లంబులు; ధరుండు = ధరించినవాడు; అయి = ఐ; రోహితుండు = రోహితుడు; తిరుగుచుండి = విహరింస్తూ; వరుణ = వరుణుని ప్రభావమునకు; గ్రస్తుండు = లోనైనవాడు; ఐ = అయ్యి; హరిశ్చంద్రుండు = హరిశ్చంద్రుడు; మహోదరవ్యాది = కడుపుబ్బరింపువ్యాధి; చేన్ = చేత; పీడితుండు = బాధింపబడువాడు; కాన్ = అయ్యి; ఉండుటన్ = ఉండుటను; విని = తెలిసి; పురంబున్ = నగరమున; కున్ = కు; తిరిగి = మరలి; రాన్ = వచ్చుటకు; గమకింపన్ = బయలుదేరుచుండగా; ఇంద్రుండు = ఇంద్రుడు; ముసలి = ముదుసలి; తపసి = ముని; ఐ = వేషమున; వచ్చి = వచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా అడవికి వెళ్ళి విల్లంబులు ధరించి విచారంగా తిరుగుతున్న రోహితుడికి, వరుణుని ప్రభావం వలన తండ్రి కడుపు ఉబ్బరింపుతో బాధపడుతున్నాడు అని తెలిసింది. అతను నగరానికి మరలి వచ్చుటకు బయలుదేరుతుంటే, ఇంద్రుడు ముదుసలి ముని వేషంలో వచ్చి ఇలా చెప్పాడు.