పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : హరిశ్చంద్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-195-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికినం గుమారుండు గలిగెడు మని వరంబిచ్చి వరుణుండు చనియె; నంత హరిశ్చంద్రునకు వరుణప్రసాదంబున రోహితుఁడను కుమారుండు జన్మించె; వరుణుండును హరిశ్ఛంద్రకుమారు నుద్దేశించి.

టీకా:

అని = అని; పలికినన్ = అడుగగా; కుమారుండు = పుత్రుడు; కలిగెడుము = కలుగుగాక; అని = అని; వరంబున్ = వరమును; ఇచ్చి = ఇచ్చి; వరుణుండు = వరుణదేవుడు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంతన్ = అప్పుడు; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; కున్ = కి; వరుణ = వరుణుని; ప్రసాదంబునన్ = అనుగ్రహమువలన; రోహితుడు = రోహితుడు; అను = అనెడి; కుమారుండు = పుత్రుడు; జన్మించె = పుట్టెను; వరుణుండును = వరుణుడు; హరిశ్చంద్ర = హరిశ్చంద్రుని; కుమారున్ = పుత్రుని; ఉద్దేశించి = ఘురించి;

భావము:

అని అడుగగా పుత్రుడు కలిగేలా వరుణదేవుడు వరం ఇచ్చాడు. అప్పుడు హరిశ్చంద్రునికి వరుణుని అనుగ్రహంవలన రోహితుడు అని పుత్రుడు పుట్టాడు. హరిశ్చంద్రుని పుత్రుని గురించి వరుణుడు...