పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : హరిశ్చంద్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-192-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురుశాపవశమునఁ గూలి చండాలుఁడై-
నఘాత్ముఁ గౌశికు నాశ్రయించి;
తని లావున దివిజాలయంబున కేఁగ-
న్నింప కమరులు రలఁ ద్రోయఁ;
ల క్రిందుగాఁ బడి దైన్యంబుతో రాఁగఁ-
గౌశికుఁ డెప్పటి నత మెఱసి
నిలిపె నాకసమున; నేఁడు నున్నాడు త్రి-
శంకుఁ; డాతఁడు హరిశ్చంద్రుఁ గనియె;

9-192.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా హరిశ్చంద్రుఁ గౌశికుఁ ర్థిఁ జేరి
యాగదక్షిణామిషమున ఖిలధనముఁ
గొల్లగొని మీఁదఁ గులహీనుఁ గొలువఁ బెట్ట;
బొంక కలజడిఁ బొందె నా భూవరుండు.

టీకా:

గురు = గురువుయొక్క; శాప = శాపమునకు; వశమునన్ = గురగుటవలన; కూలి = కుంగిపోయి; చండాలుడు = నీచపుట్టుకవాడు, మాలవాడు; ఐ = అయ్యి; అనఘాత్మున్ = పుణ్యాత్ముని; కౌశికున్ = విశ్వామిత్రుని {కౌశికుడు - కుశికుని మనుమడు, విశ్వామిత్రుడు}; ఆశ్రయించి = చేరి; అతని = అతని; లావునన్ = శక్తివలన; దివిజాలయమున్ = స్వర్గమున; కున్ = కు; ఏగన్ = వెళ్ళగా; మన్నింపక = అంగీకరింపకుండ; అమరులు = దేవతలు; మరలన్ = వెనక్కు; త్రోయన్ = తోసివేయగా; తలక్రిందుగాన్ = తలకిందులుగా; పడి = పడిపోయి; దైన్యంబు = దీనత్వము; తోన్ = తోటి; రాగన్ = వస్తుండగా; కౌశికుడు = విశ్వామిత్రుడు; ఎప్పటి = తనకుసామాన్యమైన; ఘనతన్ = గొప్పదనముతో; మెఱసి = అతిశయించి; నిలిపెన్ = ఆపెను; ఆకసమునన్ = ఆకాశమునందు; నేడున్ = ఇప్పటికిని; ఉన్నాడు = ఉన్నాడు; త్రిశంకుడు = త్రిశంకుడు {త్రిశంకుడు - 1తండ్రికి బాధకలిగెడి కార్యము చేయుటచేతను 2గురుధేనువును వధించుట చేతను 3అప్రోక్షిత మాంసమును భక్షించుట చేతను త్రివిధ హృదయ శంకువులుగల ఇతనికి ఈ పేరు వసిష్ఠునిచే పేరుపెట్టబడెను}; ఆతడు = అతను; హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; కనియెన్ = పొందెను; ఆ = ఆ.
హరిశ్చంద్రున్ = హరిశ్చంద్రుని; కౌశికుడు = విశ్వామిత్రుడు; అర్థిన్ = దానమునకు; చేరి = దగ్గరకు వెళ్ళి; యాగ = యాగమునకైన; దక్షిణ = దక్షిణ యనెడి; మిషన్ = వంకతో; అఖిల = సమస్తమైన; ధనమున్ = సంపదలను; కొల్లగొని = కొల్లగొట్టి; మీదన్ = ఆపైన; కులహీను = తక్కువకులమువానివద్ద; కొలువు = సేవకవృత్తిని; పెట్టన్ = పెట్టగా; బొంకక = అబద్దమాడకుండ; అలజడి = ఇబ్బందులను; పొందెన్ = పొందెను; ఆ = ఆ; భూవరుండు = రాజు.

భావము:

సత్యవ్రతుడు గురుశాపానికి గురై చండాలుడు అయ్యాడు. పుణ్యాత్ముడైన విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించి, అతని శక్తివలన స్వర్గానికి వెళ్ళగా, దేవతలు అంగీకరించక వెనక్కి తోసేసారు. సత్యవ్రతుడు దయనీయంగా తలకిందులుగా పడిపోసాగాడు. విశ్వామిత్రుడు తన తపోశక్తిని వాడి అతనిని ఆకాశంలో ఆపాడు. ఇప్పటికి అతను త్రిశంకుడు అనబడుతూ అలా తలక్రిందులుగా ఆకాశంలో ఉన్నాడు. త్రిశంకుడికి హరిశ్చంద్రుడు పుట్టాడు. విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుని దగ్గరకు వెళ్ళి యాగానికి దక్షిణ అనె వంకతో అతని సమస్త సంపదలను దానం రూపంలో కొల్లగొట్టాడు. ఇంకా ఆపైన నీచకులస్థుడివద్ద సేవకుడిగా చేసాడు. అయినా హరిశ్చంద్రుడు అబద్దమాడకుండ ఎంత కష్ఠాన్ని అయినా భరించాడు.