పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : వికుక్షి చరితము

  •  
  •  
  •  

9-164-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లావు మెఱసి యిరువది యొక
వేవురు నందనులుఁ దాను వీరుఁ డతఁడు భూ
దేవుఁ డుదంకుడు పనుప దు
రాహుఁడై చంపె దుందు మరాబంధున్.

టీకా:

లావు = శక్తి సామర్థ్యములు; మెఱసి = ప్రకటమొగునట్లు; ఇరువదియొక = ఇరవైయొక్క; వేవురు = వేయిమంది; నందనులున్ = పుత్రులు; తానున్ = అతను; వీరుడు = శూరుడు; భూదేవుడు = బ్రాహ్మణుడు; ఉదంకుడు = ఉదంకుడు; పనుప = ఆజ్ఞాపించగా, నియోగించగా; దురావహుడు = సహింపరానివాడు; ఐ = అయ్యి; చంపెన్ = సంహరించెను; దుందున్ = దుందుని {దుందుము = కాష్ఠదీపిక, చక్రారారపు దివిటీ, సూర్యారాయాంద్ర నిఘంటువు} (ధుంధువు అని పాఠ్యంతరం, ధుంధుమారము అంచే ఆరుద్ర పురుగు అని నిఘంటువు); అమరాబంధున్ = రాక్షసుని {అమరాబంధుడు - అమర (దేవతల) అబంధుడు (శత్రువు), రాక్షసుడు}.

భావము:

కువలయాశ్వుడు ఇరవైయొక్క వేయి మంది పుత్రులుతో కలిసి వెళ్ళి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా దుందుడు (ధుంధువు అని పాఠ్యంతరం) అనే రాక్షసుడిని సంహరించాడు.