పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : వికుక్షి చరితము

  •  
  •  
  •  

9-162-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చి శరావళిన్ దనుజనాథుల మేనులు చించి కంఠముల్
దొడిఁదొడిఁ ద్రుంచి కాలుపురి త్రోవకుఁ గొందఱఁ బుచ్చి కొందఱన్
డి నురగాలయంబున నివాసము చేయఁగ దోలి యంతనూ
క నిశాచరేంద్రుల పురంబులు గూల్చెఁ బురంజయాఖ్యతన్.

టీకా:

నడచి = వెళ్ళి; శరా = బాణముల; ఆవళిన్ = సమూహములతో; దనుజ = రాక్షస; నాథుల = రాజుల; మేనులున్ = దేహములు; చించి = ఖండించి; కంఠముల్ = మెడలను; తొడిదొడిన్ = వెనువెంటనే; త్రుంచి = ఖండించి; కాలుపురి = నరకపు {కాలుపురి - కాలు (యముని) పురి (పట్టణము), నరకము}; త్రోవ = దారి; కున్ = కి; కొందఱన్ = కొంతమందిని; పుచ్చి = పంపించి; కొందఱన్ = కొంతమందిని; వడిన్ = వేగముగ; ఉరగాలయంబునన్ = పాతాళలోకమున {ఉరగాలయము - ఉరగ (పాముల) ఆలయము (నివాసము), పాతాళము}; నివాసముచేయన్ = ఉండుటకు; తోలి = తరిమి; అంతన్ = అంతటితో; ఊఱడక = శాంతించక; నిశాచర = రాక్షస {నిశాచరులు - నిశ (రాత్రులందు) చరించువారు, రాక్షసులు}; పురంబులున్ = నగరములను; కూల్చెన్ = కూలగొట్టెను; పురంజయ = పురంజయుడు; ఆఖ్యాతన్ = పేరుతోను.

భావము:

పురంజయుడు వెళ్ళి తన బాణాలతో రాక్షస రాజులను ఖండించి నరకానికి పంపించాడు. కొంతమందిని పాతాళలోకానికి తరిమాడు. అంతటితో శాంతించక రాక్షస నగరాలను కూలగొట్టాడు.