పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : వికుక్షి చరితము

  •  
  •  
  •  

9-161-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కృతయుగాంతంబున దితిసుతామరులకు-
ణ మయ్యె; నందు నా రాక్షసులకు
మర వల్లభుఁ డోడి రితోడఁ జెప్పిన-
లజనేత్రుఁడు పురంయుని యందు
చ్చి నే నుండెద వాసవ! వృషభంబ-
వై మోవు మని పల్క మరవిభుఁడు
గోరాజమూర్తిఁ గకుత్ప్రదేశంబున-
నా పురంజయు మోచె నంత నతఁడు

9-161.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విష్ణుతేజంబు దనయందు విస్తరిల్ల
దివ్యచాపంబు చేఁబట్టి దీర్ఘ నిశిత
బాణములఁ బూని వేల్పులు ప్రస్తుతింప
నంతఁ గాలాగ్ని చాడ్పున నికి నడచె.

టీకా:

కృతయుగ = కృతయుగము; అంతంబునన్ = తీరుసమయమునందు; దితిసుత = రాక్షసులు {దితిసుతులు - దితియొక్క పుత్రులు, రాక్షసులు}; అమరుల్ = దేవతల {అమరులు - మరణము లేని వారు, దేవతలు}; కున్ = కు; రణము = యుద్ధము; అయ్యెన్ = అయినది; అందున్ = దానిలో; ఆ = ఆ; రాక్షసుల్ = రాక్షసుల; కున్ = కు; అమరవల్లభుడు = ఇంద్రుడు {అమరవల్లభుడు - దేవతలనాయకుడు, ఇంద్రుడు}; ఓడి = ఓడిపోయి; హరి = నారాయణుడు; తోడన్ = తోటి; చెప్పినన్ = చెప్పుకొనగా; జలజనేత్రుడు = నారాయణుడు {జలజనేత్రుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పురంజయుని = పురంజయుని; అందున్ = లో; వచ్చి = చేరి; నేన్ = నేను; ఉండెదన్ = ఉంటాను; వాసవ = ఇంద్రుడా {వాసవుడు - వసువులు కలవాడు, ఇంద్రుడు}; వృషభంబవు = ఆబోతు, ఎద్దు; ఐ = అయ్యి; మోవుము = వాహనముగా ధరించు; అని = అని; పల్కన్ = చెప్పగ; అమరవిభుడు = ఇంద్రుడు {అమరవిభుడు - దేవతలనాయకుడు, ఇంద్రుడు}; గోరాజ = ఆబోతు; మూర్తిన్ = రూపుతో; కకుత్స్థ = మూపురపు; ప్రదేశంబునన్ = ప్రదేశమునందు; ఆ = ఆ; పురంజయున్ = పురంజయుని; మోచెన్ = మోసెను; అంత = అప్పుడు; అతడు = అతడు.
విష్ణు = నారాయణుని; తేజంబున్ = తేజస్సు; తన = తన; అందున్ = లో; విస్తరిల్లన్ = అతిశయించగా; దివ్య = గొప్ప; చాపంబున్ = విల్లును; చేబట్టి = చేతపట్టుకొని; దీర్ఘ = పెద్దవైన; నిశిత = వాడియైన; బాణములన్ = బాణములను; పూని = ధరించి; వేల్పులు = దేవతలు; ప్రస్తుతింపన్ = కీర్తించుచుండగ; అంతకాలాగ్ని = ప్రళయకాలాగ్ని; చాడ్పునన్ = వలె; అని = యుద్ధభూమి; కిన్ = కి; నడచె = వెళ్ళెను.

భావము:

కృతయుగాంత కాలంలో రాక్షసులకు దేవతలకు పెద్ద యుద్ధం జరిగింది. దానిలో ఇంద్రుడు ఓడిపోయి శ్రీహరితో చెప్పుకోగా, “ఇంద్రా! నేను పురంజయునిలో చేరి ఉంటాను. ఎద్దు రూపుడవు అయి అతనికి వాహనంగా ఉండు.” ఆ ప్రకారం ఇంద్రుడు ఎద్దు రూపుడు అయి మూపురం మీద పురంజయుని మోసాడు. అప్పుడు అతడు నారాయణుని తేజస్సుతో గొప్ప విల్లును బాణాలు చేపట్టి దేవతలు కీర్తిస్తుండగ ప్రళయకాలాగ్ని వలె యుద్ధభూమికి వెళ్ళాడు.