పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : వికుక్షి చరితము

  •  
  •  
  •  

9-157-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుఁగా కంచు వికుక్షి వేఁటజని ఘోరారణ్యభూమిం దగన్
మృసంఘంబులఁ జంపి బిట్టలసి తా; మే నొల్లఁబో నాకటన్
మై యొక్క శశంబుఁ బట్టి తిని శేషంబైన మాంసంబు శీ
ఘ్రతిం దండ్రికిఁ దెచ్చి యిచ్చె నకలంస్ఫూర్తి వర్ధిల్లగాన్.

టీకా:

అగుగాక = అలాగే; అంచున్ = అంటు; వికుక్షి = వికుక్షి; వేటన్ = వేటకు; చని = వెళ్ళి; ఘోర = భయంకరమైన; అరణ్య = అటవీ; భూమిన్ = ప్రదేశమునందు; తగన్ = తగిన విధంగా; మృగ = జంతువుల; సంఘంబులన్ = సమూహములను; చంపి = సంహరించి; బిట్టు = మిక్కిలి; అలసి = అలిసిపోయి; తాన్ = అతను; మేన్ = శరీరము; ఒల్లబోన్ = వాడిపోగా; ఆకటన్ = ఆకలితో; సగము = చిక్కి పోయినవాడు; ఐ = అయ్యి; ఒక్క = ఒక; శశంబున్ = కుందేలును; పట్టి = పట్టుకొని; తిని = భుజించి; శేషంబున్ = మిగలినది; ఐన = అయినట్టి; మాంసంబున్ = మాంసమును; శీఘ్ర = మిక్కిలి వేగవంతముగ; గతిన్ = ప్రయాణించి; తండ్రి = తండ్రి; కిన్ = కి; తెచ్చి = తీసుకెచ్చి; ఇచ్చెన్ = ఇచ్చెను; అకలంక = నిష్కళంకమైనదిగా; స్ఫూర్తి = తలచబడుట; వర్ధిల్లగాన్ = బాగాకలుగునట్లు.

భావము:

అలా వేటకు వెళ్ళిన వికుక్షి భయంకరమైన అడవిలో తగిన జంతువులను వేటాడి బాగా అలిసిపోయాడు. ఆకలికి చిక్కి ఒక కుందేలును పట్టుకొని భుజించాడు. మిగలిన మాంసాన్ని వేగంగా వెళ్ళి పరిశుద్ధమైంది అని చెప్పి తండ్రికి ఇచ్చాడు.