పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఇక్ష్వాకుని వంశము

  •  
  •  
  •  

9-155-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాఁడు మనువు దుమ్మిన
విలుఁడు గా కతని ఘ్రాణవివరము వెంటం
బ్రటయశుం డిక్ష్వాకుం
లంకుఁడు పుట్టె రవికులాధీశుండై.

టీకా:

ఒక = ఒకానొక; నాడు = దినమున; మనువు = మనువు; తుమ్మినన్ = తుమ్మగా; వికలుడు = వైకల్యముకలవాడు; కాక = కానట్టివాడు; అతని = అతనియొక్క; ఘ్రాణవివరము = ముక్కురంధ్రము; వెంటన్ = నుండి; ప్రకట = ప్రసిద్ధమైన; యశుండు = కీర్తిగలవాడు; ఇక్ష్వాకుండు = ఇక్ష్వాకుడు; అకలంకుడు = నిష్కంళంకుడు; పుట్టెన్ = జనించెను; రవికుల = సూర్యవంశపు; అధీశుండు = రాజు; ఐ = అయ్యి.

భావము:

“ఒక నాడు మనువు తుమ్మగా ఆ వైకల్యరహితుని ముక్కురంధ్రం నుండి నిష్కంళంకుడు ఇక్ష్వాకుడు జనించాడు. అతను సూర్యవంశపు రాజులలో ముఖ్యుడు.