పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-153-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యంబరీషు చరితముఁ
దీయంబున విన్నఁ జదువ ధీసంపన్నుం
డై యుండును భోగపరుం
డై యుండును నరుఁడు పుణ్యుఁడై యుండు నృపా!

టీకా:

ఈ = ఈయొక్క; అంబరీషున్ = అంబరీషుని; చరితమున్ = కథను; తీయంబునన్ = ఆసక్తితో; విన్నన్ = వినినను; చదువన్ = చదివినను; ధీ = జ్ఞానము; సంపన్నుండు = అదికముగాగలవాడు; ఐ = అయ్యి; ఉండును = ఉండును; భోగపరుండు = వైభోగములుగలవాడు; ఐ = అయ్యి; ఉండును = ఉండును; నరుడు = మానవుడు; పుణ్యుడు = పుణ్యాత్ముడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; నృపా = రాజా {నృపా - నరులను పాలించువాడు, రాజు}.

భావము:

ఓ పరీక్షిన్మహారాజా! ఈ అంబరీషుని కథను ఆసక్తితో విన్న వాడు, చదివిన వాడు గొప్ప జ్ఞానవైభోగాలు పొంది పుణ్యాత్ములు అవుతారు.