పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-152-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నకు సదృశులైన నయుల రావించి
రణి భరము వారిఁ దాల్పఁ బంచి
కాననంబు చొచ్చెఁ గామాది విజయుఁడై
రవిభుండు హరిసనాథుఁ డగుచు.

టీకా:

తన = తన; కున్ = కు; సదృశులు = సాటివచ్చెడివారు; ఐనన్ = అయినట్టి; తనయుల్ = పుత్రులను; రావించి = పిలిపించి; ధరణిభరమున్ = భూభారమును; వారిన్ = వారికి; తాల్పన్ = భరించమని; పంచి = ఆజ్ఞాపించి; కాననంబు = అడవికి; చొచ్చెన్ = వెళ్లిపోయెను; కామాది = అరిషడ్వర్గములను {కామాది - 1కామ 2క్రోధ 3లోభ 4మద 5మోహ 6మాత్సర్య అనెడి వర్గ శత్రులు, అరిషడ్వర్గములు}; విజయుడు = జయించినవాడు; ఐ = అయ్యి; నరవిభుండు = రాజు {నరవిభుడు - మానవులప్రభువు, రాజు}; హరి = విష్ణుమూర్తిని; సనాథుడు = అండగాగలవాడు; అగుచున్ = ఐ ఉండి.

భావము:

అలా అరిషడ్వర్గాలను జయించిన అంబరీషుడు, తనకు సాటివచ్చె పుత్రులను పిలిపించి రాజ్యభారం వారికి అప్పజెప్పి. విష్ణుమూర్తిని అండగాగొని అడవికి వెళ్లిపోయాడు.