పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-147-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని చెప్పి దుర్వాసుం డంబరీషుని దీవించి కీర్తించి మింటి తెరువున బ్రహ్మలోకంబునకుం జనియె, మునీశ్వరుండు వచ్చి మగుడం జనువేళకు నొక్కవత్సరంబు నిండి వ్రతంబు పరిపూర్ణం బైన.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; దుర్వాసుండు = దుర్వాసుండు; అంబరీషుని = అంబరీషుని; దీవించి = ఆశీర్వదించి; కీర్తించి = పొగిడి; మింటి = ఆకాశ; తెరువునన్ = మార్గములో; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; ముని = మునులలో; ఈశ్వరుండు = ఉత్తముడు; వచ్చి = వచ్చి; మగుడన్ = తిరిగి; చను = వెళ్ళెడి; వేళ = సమయమున; కున్ = కు; వత్సరంబున్ = సంవత్సరము; నిండి = పూర్తయిపోయి; వ్రతంబు = వ్రతము; పరిపూర్ణంబు = సంపూర్ణము; ఐనన్ = కాగా.

భావము:

అని చెప్పి దుర్వాసుండు అంబరీషుని ఆశీర్వదించి, పొగిడి, ఆకాశమార్గాన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. మునీశ్వరుడు వచ్చి తిరిగి వెళ్ళిన సమయానికి సంవత్సరం పూర్తయిపోయి వ్రతం సంపూర్ణము అయింది. కనుక....