పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-142-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాటెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోకిఁనన్
లాఘంబులు పల్లటిల్లి తొలఁగున్ సంభ్రాంతితో నట్టి స
త్సురున్ మంగళతీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశుని
న్నలంకస్థితిఁ గొల్చు భక్తులకు లే డ్డంబు రాజాగ్రణీ!

టీకా:

ఒక = ఒక్క; మాటు = సారి; ఎవ్వని = ఎవనియొక్క; పేరు = నామము; కర్ణముల = చెవుల; లోనన్ = అందు; ఒయ్యారము = విలాసముగా; ఐ = అయ్యి; సోకినన్ = స్పర్శించినను; సకల = సమస్తమైన; అఘంబులున్ = పాపములు; పల్లటిల్లి = పటాపంచలై, చలించి; తొలగున్ = పోవును; సంభ్రాంతి = భయభ్రాంతుల; తోన్ = తోటి; అట్టి = అటువంటి; సత్సుకరున్ = నారాయణుని {సత్సుకరుడు - సత్ (మంచి) సుకరుడు (మేలు) కరుడు (కలిగించువాడు), విష్ణువు}; మంగళతీర్థపాదున్ = నారాయణుని {మంగళతీర్థపాదుడు - శుభకరమైన తీర్థము పాదములవద్ద కలవాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; దేవదేవేశునిన్ = నారాయణును; అకలంక = నిష్కళంకమైన; స్థితిన్ = విధముగా; కొల్చు = సేవించెడి; భక్తులు = భక్తుల; కున్ = కు; లేదు = లేదు; అడ్డంబు = సాధ్యముగానిది; రాజ = రాజులలో; అగ్రణీ = గొప్పవాడ.

భావము:

రాజశేఖరా! సత్సుకరుడు, మంగళతీర్థపాదుడు, అయిన మహా విష్ణువు నామాన్ని ఒక్క సారి చెవులారా స్పర్శించిన మాత్రంచేతనే సమస్త పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి ఆ నారాయణుని నిష్కళంక భక్తులైన నీవంటి వారికి సాధ్యం కానిది లేదు.