పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-140-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నాథోత్తమ! మేలు చేసితి కదా! నా తప్పు మన్నించి శ్రీ
రి పాదాబ్జము లింత ముట్టఁగొలుతే? యాశ్చర్యమౌనెన్నుచో
రుదండ్రే నినుబోఁటి సాధునకుఁ దానై యిచ్చుటల్ గాచుటల్
సొరిదిన్ నైజగుణంబులై సరస వచ్చుం గాదె మిత్రాకృతిన్.

టీకా:

నరనాథోత్తమ = మహారాజ {నరనాథోత్తముడు - నరనాథు (రాజు)లలో ఉత్తముడు, మహారాజు}; మేలు = ఉపకారము; చేసితి = చేసావు; కదా = సుమా; నా = నాయొక్క; తప్పున్ = పొరపాటును; మన్నించి = క్షమించి; శ్రీహరి = విష్ణుని; పాదములున్ = పాదములను; ఇంత = చాలా ఎక్కువగా; ముట్టన్ = గాఢముగా; కొలుతే = సేవించితివి; ఆశ్చర్యము = ఆశ్చర్యకరము; ఔన్ = ఐనది; ఎన్నుచో = తరచిచూసినచో; అరుదు = అపూర్వమైనది; అండ్రే = అంటారా, అనరు; నినున్ = నిన్ను; పోటి = వంటి; సాదున్ = మంచివాని; కున్ = కి; తానై = తనంతతానే; ఇచ్చుటల్ = దానముచేయుటలు; కాచుటల్ = కాపాడుటలు; సొరిదిని = మామూలుగా; నైజ = సహజ; గుణంబులు = గుణములు; ఐ = అయ్యి; సరసన్ = సుళువుగా; వచ్చున్ = సంప్రాప్తించును; కాదే = కదా; మిత్ర = మిత్రుని; ఆకృతిన్ = వలె.

భావము:

“నా పొరపాటును క్షమించి ఉపకారం చేసావు సుమా అంబరీష! విష్ణుపాదాలను ఎంత గాఢంగా సేవించావు. ఇలా నీవు నన్ను కాపాడుట ఆశ్చర్యకరము కాదు అపూర్వము కాదు. ఎందుకంటే నీ వంటి మంచివానికి దానాలు చేయుట, కాపాడుటలు అతి సహజ గుణాలు. ఆ సుగుణాలు సూర్యభగవానునికి వలె నీవంటి వారికి సుళువుగా సంప్రాప్తిస్తాయి కదా.