పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-138-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిల గుణాశ్రయుఁ డగు హరి
సుఖియై నా కొలువు వలనఁ జొక్కెడి నేనిన్
నిఖిలాత్మమయుం డగుటకు
సుమందుం గాక భూమిసురుఁ డివ్వేళన్."

టీకా:

అఖిల = సర్వ; గుణ = గుణములందును; ఆశ్రయుడు = చేరియుండువాడు; హరి = విష్ణువు; సుఖి = సంతోషించినవాడు; ఐ = అయ్యి; నా = నాయొక్క; కొలువు = సేవ, ఆరాధన; వలన = వలన; చొక్కెడిని = తృప్తిచెందెను; ఏనిన్ = అయినచో; నిఖిల = సర్వా; ఆత్మన్ = ఆత్మలయందున్; మయుండు = నిండియుండువాడు; అగుటకు = ఐనట్లునిదర్శనముగా; సుఖమున్ = సుఖమును; అందుగాక = పొందుగాక; భూమిసురుడు = బ్రాహ్మణుడు {భూమిసురుడు - భూమికిదేవత, విప్రుడు}; ఈ = ఈ; వేళన్ = సమయమున.

భావము:

నా సేవ, ఆరాధనలకు సర్వగుణాత్మకుడు, సర్వాత్మకుడు అయిన శ్రీమహావిష్ణువు సంతోషించి తృప్తిచెందినట్లయితే, నిదర్శనంగా ఈ మునీశ్వరుడు ఇప్పుడే శాంతిని పొందుగాక.”