పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-132-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చీఁటిఁ బాపుచున్ వెలుఁగు జేయుచు సజ్జనకోటినెల్ల స
శ్రీను జేయు నీరుచులు చెల్వుగ ధర్మసమేతలై నినున్
వాకున నిట్టి దట్టిదని ర్ణన చేయ విధాత నేరఁ డ
స్తోము నీదు రూపు గలదుం దుది లేదు పరాత్పరాద్యమై.

టీకా:

చీకటిన్ = చీకటిని; పాపుచున్ = పారద్రోలుచు; వెలుగున్ = కాంతిని; చేయుచున్ = పుట్టిస్తూ; సజ్జన = మంచివారి; కోటిన్ = సమూహములు; ఎల్లన్ = అన్నిటిని; సశ్రీకనున్ = సుసంపన్నము; చేయున్ = చేయును; నీ = నీయొక్క; రుచులు = కాంతులు; చెల్వుగ = చక్కగా; ధర్మసమేతలు = ధర్మముగలవారు; ఐ = అయ్యి; నినున్ = నిన్ను; వాకున = నోటితో; ఇట్టిదట్టిది = వివరముగ; అని = పలికి; వర్ణనచేయన్ = కీర్తించుటకు; విధాత = బ్రహ్మదేవుడు; నేరడు = సరిపోడు; అస్తోకము = మహోన్నతము; నీదు = నీయొక్క; రూపున్ = స్వరూపము; కలదు = ఉన్నది; అందున్ = దానిలో; తుది = అంతము; లేదు = లేదు; పరాత్పర = విష్ణుమూర్తితో; ఆద్యము = మొదలైనది; ఐ = అయ్యి.

భావము:

ధర్మమైన నీ కాంతులు చీకటిని పారద్రోలుతూ సజ్జనులను, ధర్మాత్ములను సుసంపన్నం చేస్తాయి. నిన్ను కీర్తించుటకు బ్రహ్మదేవుడికే సాధ్యం కాదు. నీది మహోన్నతమై, అనంతమై పరాత్పర స్వరూపం.