పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-131-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఁగి నిద్రపోవఁ లలోన వచ్చిన
నిన్నుఁ జూచి దీర్ఘనిద్ర పోదు
సురవరులు శయ్యలం దున్న సతులు ప్ర
భాతమందు లేచి లవరింప.

టీకా:

కలగినిద్రపోవన్ = కలతనిద్రపోతుండగ; కల = స్వప్నము; లోనన్ = అందు; వచ్చిన = కనిపించిన; నిన్నున్ = నిన్ను; చూచి = చూసి; దీర్ధనిద్రపోదురు = చనిపోతారు; అసుర = రాక్షస; వరులు = శ్రేష్ఠులు; శయ్యలు = పక్కల; అందున్ = అందు; ఉన్న = ఉన్నట్టి; సతులు = భార్యలు; ప్రభాతము = ఉదయపు; అందున్ = సమయమున; లేచి = నిద్రలేచి; పలవరింపన్ = గొల్లుమనగ.

భావము:

కలతనిద్ర పోతుండగా వచ్చిన స్వప్నంలో నీవు కనిపిస్తే చాలు, ఎంతటి రాక్షసులు అయినా నిద్రలోనే మరణిస్తారు. ప్రక్కనే నిద్రిస్తున్న భార్యలు ఉదయం నిద్రలేచి గొల్లుమంటారు.