పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-130-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిచే నీవు విసృష్టమై చనఁగ మున్నాలించి నీ ధారలన్
ణిన్ వ్రాలుట నిక్కమంచు మునుపే దైత్యేశ్వరవ్రాతముల్
శిముల్ పాదములున్ భుజాయుగళముల్ చేతుల్ నిజాంగంబులం
దురులన్ బ్రాణసమీరముల్ వదలు నీ యుద్ధంబులం జక్రమా!

టీకా:

హరి = విష్ణుమూర్తి; చేన్ = చేత; నీవున్ = నీవు; విసృష్టము = విసరబడినది; ఐ = అయ్యి; చనగన్ = వెళ్ళగా; మున్ను = ముందు; ఆలించి = పసిగట్టి; నీ = నీయొక్క; ధారలన్ = పదునులచే; ధరణిన్ = నేలమీద; వ్రాలుట = పడిపోవుట; నిక్కము = తప్పనిది; అనుచున్ = భావించుకొని; మునుపే = ముందుగానే; దైత్య = రాక్షస; ఈశ్వర = ప్రభువుల; వ్రాతముల్ = సమూహములు; శిరముల్ = తలలు; పాదములున్ = కాళ్ళు; భుజా = భుజముల; యుగళముల్ = జంటలు (2); చేతుల్ = చేతులు; నిజ = తమ; అంగంబులన్ = దేహములందు; దురలన్ = దురపిల్లగా, కలతనొందగా; ప్రాణసమీరముల్ = ప్రాణవాయువులను; వదలున్ = వదలెదరు; నీ = నీవుచేసెడి; యుద్ధంబులన్ = యుద్ధములలో; చక్రమా = ఓ చక్రమా.

భావము:

ఓ చక్రరాజమా! విష్ణుమూర్తి దుష్ట రాక్షస ప్రభువుల పైకి నిన్ను ప్రయోగించగా, వారు నీరాక ముందుగానే పసిగట్టి నీ అంచుల పదునులచే నేలపడుట తప్పదని, తలలు కాళ్ళు భుజాలు చేతులు తెగిపోతాయని గ్రహించి, కలతనొంది ప్రాణాలు వదలుతారు.