పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-128-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కని దుఃఖితుండయి, యమ్మహీవల్లభు పాదంబులు పట్టి విడువకున్న నా నరేంద్రచంద్రుండు చరణస్పర్శనంబునకు నోడుచుఁ గరుణారసభరిత హృదయుండయి, హరిచక్రంబు నిట్లని స్తుతియించె.

టీకా:

కని = దర్శించి; దుఃఖితుడు = దుఃఖించెడివాడు; అయి = ఐ; ఆ = ఆ; మహీవల్లభు = రాజుయొక్క; పాదంబులున్ = కాళ్ళను; పట్టి = పట్టుకొని; విడువకున్నన్ = వదలకపోగా; ఆ = ఆ; నరేంద్రచంద్రుండు = మహారాజు {నరేంద్రచంద్రుడు - నరేంద్రులు (రాజులు) అనెడి తారలలో చంద్రునివంటివాడు, మహారాజు}; చరణస్పర్శంబున్ = కాళ్లుపట్టుకొనుటచేత; ఓడుచున్ = కరిగిపోతూ; కరుణా = కృపయనెడి; రస = రసముచే; భరిత = నిండిన; హృదయుండు = హృదయముగలవాడు; అయి = అయ్యి; హరిచక్రంబున్ = విష్ణుచక్రమును; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = కీర్తించెను.

భావము:

అలా దర్శించిన దూర్వాసుడు దుఃఖిస్తూ ఆ రాజు కాళ్ళను వదలకుండా పట్టుకొన్నాడు. ఆ కృపారసహృదయుడు అంబరీష మహారాజు కరిగిపోయి విష్ణుచక్రాన్ని ఈ విధంగ కీర్తించాడు.