పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-126-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దె పో బ్రాహ్మణ! నీకును
యుఁడు నాభాగసుతుఁడు నవినుత గుణా
స్పదుఁ డిచ్చు నభయ మాతని
ది సంతసపఱచి వేఁడుమా శరణంబున్."

టీకా:

అదె = అందుకనే; పో = వెళ్ళుము; బ్రాహ్మణ = విప్రుడా; నీ = నీ; కునున్ = కుకూడ; సదయుడు = దయగలవాడు; నాభాగసుతుడు = అంబరీషుడు; జన = లోకులచే; వినుత = కీర్తింపబడు; గుణ = సుగుణములు; ఆస్పదుడు = నివాసమైనవాడు; ఇచ్చున్ = ఇచ్చును; అభయము = రక్షణను; ఆతనిన్ = అతనిని; మదిన్ = మనసును; సంతసపఱచి = సంతోషపెట్టి; వేడుమా = వేడుము; శరణంబున్ = శరణు.

భావము:

ఓ విప్రుడా! అందుచేత వెళ్ళు లోకులచే కీర్తింపబడే సుగుణాలు కల అంబరీషుడు దయగలవాడు, అతను నీకు రక్షణను ఇస్తాడు. అతని మనసును సంతోషపెట్టి శరణు వేడు.”