పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-123-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాధుల హృదయము నాయది;
సాధుల హృదయంబు నేను; గముల నెల్లన్
సాధుల నేన యెఱుంగుదు
సాధు లెఱుంగుదురు నాదు రితము విప్రా!

టీకా:

సాధుల = మంచివారి; హృదయము = హృదయము; నాయది = నాది; సాధుల = మంచివారి; హృదయంబున్ = హృదయమే; నేను = నేను; జగములన్ = లోకములు; ఎల్లన్ = అన్నిటిలోను; సాధులన్ = మంచివారిని; నేన = నేనే; ఎఱుంగుదున్ = ఎరుగుదును; సాధులు = మంచివారు; ఎఱుంగుదురు = తెలిసికొందురు; నాదు = నాయొక్క; చరితమున్ = చరిత్రను; విప్రా = బ్రాహ్మణుడా.

భావము:

బ్రాహ్మణుడా! దుర్వాసా! సాధువుల హృదయం నాది. సాధువుల హృదయమే నేను. సకల లోకాలలో ఉన్న సాధువులను నేను ఎరుగుదును. వారికి నా చరిత్ర తెలుసును.