పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-118-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు రకిల్బిషభక్తిలతాచయంబులన్
నిలువఁగఁ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్;
లకుఁ జిక్కి భక్తజన త్సలతం జనకుందుఁ దాపసా!

టీకా:

చలమునన్ = పట్టుదలతో; బుద్ధిమంతులు = జ్ఞానముగలవారు; అగు = అయిన; సాధులు = మంచివారు; నా = నాయొక్క; హృదయంబున్ = మనసును; లీలన్ = సుళువుగా; దొంగిలికొనిపోవుచన్ = ఎత్తుకుపోతూ; ఉండుదురు = ఉంటారు; అకిల్బిష = నిర్మలమైన; భక్తి = భక్తి యనెడి; లత = తీగల; చయంబులన్ = సమూహములచే; నిలువగన్ = ఆగిపోవునట్లు; పట్టి = పట్టుపట్టి; కట్టుదురున్ = కట్టివేయుదురు; నేరుపు = నేర్పు; తోన్ = తోటి; మద = మదించిన; కుంభి = ఏనుగు {కుంభి - కుంభములుగలది, ఏనుగు}; కైవడిన్ = వలె; వలలన్ = వలలందు; చిక్కి = తగులుకొని; భక్త = భక్తులఎడ; వత్సలతన్ = వాత్సల్యము; కున్ = వలన; చనక = తప్పించుకుపోకుండ; ఉందున్ = ఉండెదను; అధిపా = గొప్పవాడా.

భావము:

“మహాత్మా! పట్టుదలతో జ్ఞానులు, మంచివారు నా మనసు సుళువుగా ఎత్తుకుపోతూ ఉంటారు. గొప్ప నేర్పుతో మదగజాన్ని బంధించినట్లు, వారి నిర్మల భక్తితీగలతో పట్టుపట్టి కట్టివేస్తారు. భక్తుల ఎడ వాత్సల్యతో తప్పించుకుపోకుండ ఉండిపోతాను.