పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-115-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వైకుంఠములోని భర్మ మణి సౌధాగ్రంబు పై లచ్చితోఁ
గ్రేవన్ మెల్లన నర్మభాషణములం గ్రీడించు పుణ్యున్ హరిన్
దేవాధీశ్వరుఁ గాంచి "యో వరద! యో దేవేశ! యో భక్తర
క్షావిద్యాపరతంత్ర! మానుపఁగదే క్రానలజ్వాలలన్,

టీకా:

ఆ = ఆ; వైకుంఠము = వైంకుఠము; లోని = అందలి; భర్మ = బంగారు; మణి = రత్నాల; సౌధ = భవనము; అగ్రంబున్ = డాబా; పైన్ = మీద; లచ్చి = లక్ష్మీదేవి; తోన్ = తోటి; క్రేవన్ = పార్శ్వమునందు; మెల్లన = మెల్లిగ; నర్మభాషణములన్ = సరసపుమాటలతో; క్రీడించు = ఆడుతున్న; పుణ్యున్ = నారాయణుని {పుణ్యుడు - పుణ్యమేతానైనవాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని; దేవేశ్వరున్ = నారాయణుని {దేవేశ్వరుడు - దేవతలకుదేవుడు,విష్ణువు}; కాంచి = దర్శించి; ఓ = ఓ; వరద = వరములనిచ్చెడివాడ; ఓ = ఓ; దేవేశ = దేవతాప్రభు; ఓ = ఓ; భక్త = భక్తులను; రక్షా = రక్షించెడి; విద్యా = నేర్పునందు; పరతంత్ర = లగ్నమగువాడ; మానుపగదే = పోగొట్టుము; చక్ర = చక్రపు; అనల = అగ్ని; జ్వాలలన్ = మంటలను.

భావము:

అక్కడ వైంకుఠంలో బంగారు రత్నాల భవనం డాబా మీద లక్ష్మీదేవి తోటి సరసపుమాట లాడుతున్న విష్ణువును దర్శించి, ఇలా వేడుకున్నాడు. “ఓ వరద! ఓ దేవతాప్రభు! ఓ భక్తరక్షక! ఈ చక్రాగ్ని మంటలను పోగొట్టు.