పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-112-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున సుదర్శనానల నివారణంబునకు నోప” నని విరించి పలికిన దుర్వాసుండు కైలాసంబునకుం జనుదెంచి, శర్వు నాలోకించి చక్రా నలంబు తెఱం గెఱింగించిన నమ్మహాదేవుం డిట్లనియె.

టీకా:

కావునన్ = అందుచేత; సుదర్శన = విష్ణుచక్రపు; అనల = మంటలను; నివారణంబున్ = మాన్పుట; కున్ = కు; ఓపను = సమర్థుడనుకాను; అని = అని; విరించి = బ్రహ్మదేవుడు; పలికినన్ = చెప్పగా; దుర్వాసుండు = దుర్వాసుడు; కైలాసంబున్ = వెండికొండ {కైలాసము - శివుని స్థానము, కైలాసపర్వతము}; కున్ = కు; చనుదెంచి = వచ్చి; శర్వున్ = పరమశివుని {శర్వుడు - ప్రళయమున భూతములను హింసించువాడు, శంకరుడు}; ఆలోకించి = దర్శించి; చక్ర = విష్ణుచక్రపు; అనలంబు = మంటల; తెఱంగు = విధమును; ఎఱంగించినన్ = తెలుపగా; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అందుచేత, ఈ చక్రాగ్ని మాన్పుటకు నేను సమర్థుడను కాను.” అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దుర్వాసుడు కైలాసానికి వెళ్ళి పరమశివుని దర్శించి విష్ణుచక్రాగ్ని విషయం చెప్పగానే, ఆ మహానుభావుడు ఇలా అన్నాడు.