పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-110-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" మర్థిన్ ద్విపరార్థ సంజ్ఞ గల యీ కాలంబుఁ గాలాత్ముఁడై
సొరిదిన్ నిండఁగఁ జేసి లోకములు నా చోటున్ విభుం డెవ్వఁడో
రిపూర్తిన్ గనుఁ గ్రేవఁ గెంపుగదురన్ స్మంబుగాఁజేయు నా
రి చక్రానల కీల కన్యుఁ డొకరుం డ్డంబు గా నేర్చునే?

టీకా:

కరము = మిక్కిలి; అర్థిన్ = ప్రీతితో; ద్విపరార్థ = ద్విపరార్థ {ద్విపరార్థ -రెండుపదార్థముల ప్రమాణముగలది, భూత భవిష్య లక్షణముగలది}; సంజ్ఞ = అనెడిపేరు; కల = ఉన్నట్టి; ఈ = ఈ; కాలంబున్ = కాలమును; కాలాత్ముడు = కాలస్వరూపుడు; ఐ = అయ్యి; సొరిదిన్ = క్రమముగ; నిండగన్ = పూర్తగునట్లు; చేసి = చేసి; లోకములున్ = లోకములు; ఆ = అవి ఉన్న; చోటున్ = ప్రదేశమును; విభుండు = ప్రభువు; ఎవడో = ఎవరైతే అతడు; పరిపూర్తిన్ = కాలమునిండాక; కను = కళ్ళ; గ్రేవన్ = కొనలందలి; కెంపున్ = ఎఱ్ఱదనము; కదురన్ = గద్దించగా; భస్మంబున్ = కాలిబూడిదైపోయెడిది; కాన్ = అగునట్లు; చేయున్ = చేసెడి; ఆ = ఆ; హరిచక్ర = విష్ణుచక్రము అనెడి; అగ్ని = నిప్పు; కీలల = మంటల; కున్ = కు; అన్యుడు = వేరేవాడు; ఒకరుండు = ఇంకొకడు; అడ్డంబున్ = అపెడివాడు; కాన్ = అగుటకు; నేర్చునే = చేయగలడా, లేడు.

భావము:

“ద్విపరార్థము అనబడెడి ఈ కాలాన్ని కాలస్వరూపుడు అయి, పూర్వార్థం పరార్థం రెంటిలోను కాలాన్ని నడిపి పిమ్మట కాలం తీరునట్లు చేసి లోకములుతో సహా అవి ఉన్న ప్రదేశం సర్వం విష్ణుచక్రాగ్ని కళ్ళు ఎఱ్ఱజేసి గద్దించగా కాలిబూడిదైపోతుంది. అట్టి విష్ణుచక్రాగ్నిని ఎవడూ ఆర్పలేడు.