పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-105-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రకార మెఱిఁగి రి విశ్వరూపుండు
వెఱ్ఱి తపసి చేయు వేడబంబుఁ
క్కఁబెట్టు మనుచుఁ క్రంబుఁ బంచిన
చ్చె నదియుఁ బ్రళయహ్ని పగిది.

టీకా:

ఆ = ఆ; ప్రకారమున్ = సంగతి; ఎఱిగి = తెలిసి; హరి = విష్ణుమూర్తి; విశ్వరూపుడు = విష్ణుమూర్తి {విశ్వరూపుడు - విశ్వమేతన రూపమైన వాడు, విష్ణువు}; వెఱ్ఱి = తిక్క; తపసి = ముని; చేయు = చేయుచున్న; వేడబంబున్ = వంచనను; చక్కబెట్టుము = సరిచేయుము; అనుచున్ = అంటూ; చక్రంబున్ = సుదర్శనచక్రమును; పంచినన్ = పంపించగా; వచ్చెన్ = వచ్చినది; అదియున్ = ఆదికూడ; ప్రళయవహ్ని = ప్రళయాగ్ని; పగిదిన్ = వలె.

భావము:

ఆ సంగతి తెలిసి విష్ణుమూర్తి ముని చేస్తున్న తిక్క వంచనను సరిచేయ మంటూ, సుదర్శనచక్రాన్నిపంపించాడు. ఆ చక్రం కూడ ప్రళయాగ్నిలా వచ్చి....