పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-102-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెపెటఁ బండ్లు గీఁటుచును భీకరుఁడై కనుఁ గ్రేవ నిప్పుకల్
పొపొటరాల గండములుపొంగ మునీంద్రుఁడు హుంకరించుచున్
మొదలంటఁగాఁ బెఱికి క్కన దానన కృత్య నాయుధో
త్క వరశూల హస్తయుతఁగా నొనరించి కవించె రాజుపైన్.

టీకా:

పెటపెట = పటపటమని; పండ్లు = పళ్ళు; గీటుచున్ = కొరుకుతూ; భీకరుడు = భయముగొల్పువాడు; ఐ = అయ్యి; కను = కళ్ళ; గ్రేవన్ = కొనలనుండి; నిప్పుకల్ = నిప్పుకణములు; పొటపొట = చిటపటమని; రాలన్ = రాలుతుండగ; గండములున్ = చెంపలు; ఉప్పొంగ = ఉబ్బునట్లు; ముని = మునులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; హుంకరించుచున్ = హుంకారముచేయుచు; జట = సిగలోనిజటను; మొదలంటన్ = సమూలముగ; పెఱికి = పీకి; చక్కన = చక్కగ; దానన = దానితోనే; కృత్యన్ = పిశాచమును {కృత్య - సంహారమునకై చేయబడినది}; ఆయుధ = ఆయుధముండుటచే; ఉత్కట = మదించినది; వర = శ్రేష్ఠమైన; శూల = శూలమును; హస్త = చేతిలో; యుతన్ = ధరించినదిగ; ఒనరించి = సృష్టించి; కవించెన్ = ప్రయోగించె, ప్రేరేపించె; రాజు = రాజు; పైన్ = మీదకు.

భావము:

పళ్ళు పటపట కొరుకుతూ, కళ్ళ నుండి నిప్పుకణాలు చిటపటమని రాలుస్తూ, చెంపలు ఉబ్బుతుండగా, దూర్వాసుడు అతి భీకరంగా హుంకారం చేసాడు. సిగలోని జట ఒకటి పెరికి నేలను కొట్టాడు. దానితో గొప్ప శూలాన్ని చేతబట్టి, మదించిన కృత్యను (పిశాచాన్ని) సృష్టించి, రాజు మీదకు ప్రయోగించాడు.