పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దూర్వాసుని కృత్య కథ

  •  
  •  
  •  

9-101.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుడువ రమ్మని మునుముట్టఁ గుడిచినాఁడు
ర్మభంగంబు చేసి దుష్కర్ముఁ డయ్యె;
యిన నిప్పుడు చూపెద న్ని దిశల
నేను గోపింప మాన్చువాఁ డెవ్వఁ?" డనుచు.

టీకా:

యమునన్ = యమునానది; లోన్ = అందు; కృతకృత్యుండు = పనిపూర్తిచేసుకొన్నవాడు; ఐ = అయ్యి; వచ్చి = తిరిగివచ్చి; రాజు = రాజు; చేన్ = చేత; సేవితుండు = మర్యాదలుపొందినవాడు; ఐ = అయ్యి; రాజు = రాజు; చేష్టితంబున్ = చేసినపనిని; బుద్ధి = మనసు; అందున్ = లో; ఊహించి = ఊహించి; బొమముడి = కనుబొములుముడిచిన; మొగము = ముఖము; తోన్ = తో; అదిరెడి = కంపించెడి; మేని = దేహము; తోన్ = తోటి; ఆగ్రహించి = కోపించి; రెట్టించి = (స్వరము) పెంచుతూ; ఆకలిన్ = ఆకలితో; కొట్టుమిట్టాడంగ = కరకరలాడుతుండ; ఈ = ఈ; సంపత్ = అధికమైనసంపదవలన; ఉన్మత్తునిన్ = పిచ్చిపట్టినవానిని; ఈ = ఈ; నృశంసున్ = రాజును; ఈ = ఈ; దురహంకారుని = చెడ్డఅహంకారముగలవాని; ఇందఱున్ = అంతమంది; కంటిరే = చూసారా; విష్ణు = నారాయణునికి; భక్తుడు = భక్తుడు; కాడు = కాడు; వీడు = ఇతను; నన్నున్ = నన్ను; కుడువన్ = భోజనముచేయుటకు.
రమ్మని = పిలిచి; మునుముట్ట = ముందుగానే; కుడిచినాడు = భుజించినాడు; ధర్మ = ధర్మమునకు; భంగంబున్ = విరుద్ధముగ; చేసి = చేసి; దుష్కర్ముడు = పాపి; అయ్యెన్ = అయిపోయినాడు; అయినన్ = అందుచేత; ఇప్పుడు = ఇప్పుడు; చూపెదన్ = నిరూపించెదను; అన్ని = సర్వ; దిశలన్ = దిక్కులందు; నేను = నేను; కోపింపన్ = కోపగించినచో; మాన్పువాడు = ఆపగలవాడు; ఎవ్వడు = ఎవడున్నాడు, లేడు; అనుచున్ = అంటూ.

భావము:

యమునానదికి వెళ్ళిన దూర్వాసుడు స్నానాదులు ముగించుకుని తిరిగి వచ్చాడు. రాజు చేసిన మర్యాదలు స్వీకరించి, రాజు నీరు త్రాగుట మనసున ఊహించాడు. కరకరలాడుతున్న ఆకలికి తోడుగా మునికి మిక్కిలి కోపం వచ్చింది. కనుబొమలు ముడిపడ్డాయి, దేహం కంపిస్తోంది. అప్పుడు ముని అమిత ఆగ్రహంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “ఈ రాజును చూడండి, మితిమీరిన సంపదలతో పిచ్చిపట్టింది. బహు చెడ్డ అహంకారి తప్ప ఇతడు అచ్చమైన హరిభక్తుడు కాడు. నన్ను భోజనానికి పిలిచి, ముందుగా తాను భుజించాడు. ధర్మం తప్పి పాపి అయ్యాడు. నేను కోపగిస్తే ఎక్కడా ఎవడు ఆప లేడని, ఇప్పుడు నిరూపిస్తాను చూడండి.” అంటూ....