పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : మత్యావతార కథా ఫలసృతి

 •  
 •  
 •  

8-739-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నవిభుండు దపసి త్యవ్రతుండును
త్స్యరూపి యైన మాధవుండు
సంచరించినట్టి దమలాఖ్యానంబు
వినిన వాఁడు బంధ విరహితుండు.

టీకా:

జనవిభుండున్ = రాజు {జనవిభుడు - జనుల ప్రభువు, రాజు}; తపసి = ఋషి; సత్యవ్రతుండునున్ = సత్యవ్రతుడు; మత్స్యరూపి = మత్స్యావతారుడు; ఐన = అయిన; మాధవుండు = విష్ణువు {మాధవుడు - మాధవి (లక్ష్మీదేవి) భర్త, హరి}; సంచరించిన = మెలగిన; సత్ = మంచి; అమల = స్వచ్ఛమైన; ఆఖ్యానంబున్ = కథను; వినినన్ = విన్న; వాడు = అతడు; బంధవిరహితుండు = భవబంధవిముక్తైనవాడు.

భావము:

రాజఋషియైన సత్యవ్రతుడి భక్తిని; మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు మహిమనూ; ప్రకటించే ఈ పుణ్య చరిత్రను విన్నవాడు సంసారబంధాల నుంచి విముక్తుడు అవుతాడు.

8-740-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రి జలచరావతారముఁ
రువడి ప్రతిదినముఁ జదువఁ రమపదంబున్
రుఁ డొందు వాని కోర్కులు
ణీశ్వర! సిద్ధిఁ బొందుఁ థ్యము సుమ్మీ.

టీకా:

హరి = విష్ణుమూర్తి; జలచరావతారమున్ = మత్స్యావతారమును; పరువడిన్ = క్రమముగ; ప్రతిదినమున్ = ప్రతిరోజు; చదువన్ = చదువుతుంటే; పరమపదంబున్ = ముక్తిని; నరుడున్ = మనిషి; ఒందున్ = పొందును; వాని = అతని; కోర్కులున్ = కోరికలు; ధరణీశ్వర = రాజ; సిద్ధిబొందు = సిద్ధించును; తథ్యము = తప్పదు; సుమ్మీ = సుమా.

భావము:

ఓ రాజా! ప్రతిదినమూ మత్స్యావతారం కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. అతని కోరికలు నెరవేరుతాయి. ఇది సత్యం.

8-741-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్రయాంభోనిధిలోన మేన్మఱచి నిద్రంజెందు వాణీశు మో
ము వేదంబులుఁ గొన్న దైత్యుని మృతిం బొందించి సత్యవ్రతుం
రన్ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుఁడై మీనమై
ధిం గ్రుంకుచుఁ దేలుచున్ మెలఁగు రాన్మూర్తికిన్ మ్రొక్కెదన్.

టీకా:

ప్రళయ = ప్రళయకాలమున; అంభోనిధి = సముద్రము; లోనన్ = అందు; మేన్మఱచి = మైమరచి; నిద్రంజెందు = నిద్రపోయెడి; వాణీశు = బ్రహ్మదేవుని; మోములన్ = ముఖములనుండి; వేదంబులున్ = వేదములను; కొన్న = సంగ్రహించిన; దైత్యుని = రాక్షసుని; మృతింబొందించి = సంహరించి; సత్యవ్రతుండు = సత్యవ్రతుడు; అలరన్ = సంతోషించునట్లు; బ్రహ్మమున్ = పరబ్రహ్మ; మాటలన్ = జ్ఞానమును; తెలిపి = తెలియజేసి; సర్వ = సమస్తమునకు; ఆధారుడు = ఆధారమైనవాడు; ఐ = అయ్యి; మీనము = మత్స్యావతారుడు; ఐ = అయ్యి; జలధిన్ = సముద్రమున; క్రుంకుచున్ = ములుగుతూ; తేలుచున్ = తేలుతూ; మెలగు = తిరిగెడి; రాజన్మూర్తి = మహారూపి, విష్ణుమూర్తి; కిన్ = కి; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.

భావము:

ప్రళయసముద్రంలో మైమరచి నిద్రించే బ్రహ్మదేవుడి ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్టరాక్షసుడిని సంహరించి, సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలిపి, అన్నింటికి ఆధారుడవు అయి, మత్స్యావతారంతో సముద్రంలో మునుగుతూ తేలుతూ సంచారం చేసిన మహావిష్ణువునకు నమస్కారం చేస్తున్నాను.”

8-742-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని చెప్పి.

టీకా:

అని = అని; చెప్పి = పలికి.

భావము:

అని ఈవిధంగా శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు చెప్పాడు.