పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ప్రళ యావసాన వర్ణన

  •  
  •  
  •  

8-738-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుహనాభుని కొఱకై
తర్పణ మాచరించి త్యవ్రతుఁ డా
ధి బ్రతికి మను వయ్యెను;
జాక్షునిఁ గొలువ కెందు సంపదఁ గలదే?

టీకా:

జలరుహనాభుని = విష్ణుమూర్తి; కొఱకై = కోసము; జలతర్పణమాచరించి = అర్ఘ్యముసమర్పించి; సత్యవ్రతుడు = సత్యవ్రతుడు; ఆ = ఆ; జలధిన్ = సముద్రమునుండి; బ్రతికి = బయటపడి; మనువు = మనువు; అయ్యెను = అయ్యెను; జలజాక్షుని = విష్ణుని; కొలువక = సేవించకపోతే; ఎందున్ = ఎక్కడైనా; సంపద = ఐశ్వర్యము; కలదే = ప్రాప్తించునా ప్రాప్తించదు.

భావము:

పద్మనాభుడు అయిన విష్ణుదేవుడికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించి ప్రళయ సముద్రంలోనుండి బయటపడి మనువు అయ్యాడు. ఆ పద్మాక్షుడిని విష్ణువును పూజించకుండా ఐశ్వర్యం ప్రాప్తించదు కదా!