పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : ప్రళ యావసాన వర్ణన

 •  
 •  
 •  

8-734-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంతం బ్రళయావసాన సమయంబున.

టీకా:

అంతన్ = అప్పుడు; ప్రళయ = ప్రళయము; అవసాన = ముగిసిన; సమయంబునన్ = సమయమునందు.

భావము:

అలా హయగ్రీవాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరించే సమయానికి ప్రళయకాలం ముగిసింది.

8-735-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ప్పుడు వేగు నం చెదురు చూచుచునుండు;
మునుల డెందంబులం ముదము నొందఁ,
దెలివితోఁ బ్రక్క నిద్రించు భారతి లేచి;
యోరపయ్యెదఁ జక్క నొత్తి కొనఁగ,
లినమై పెనురేయి మ్రక్కిన తేజంబుఁ;
దొంటి చందంబునఁ దొంగలింపఁ,
బ్రాణుల సంచితభాగధేయంబులుఁ;
న్నుల కొలకులఁ గానఁబడఁగ,

8-735.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వయవంబులుఁ గదలించి, యావులించి
నిదురఁ దెప్పఱి, మేల్కాంచి, నీల్గి, మలఁగి,
యొడలు విఱుచుచుఁ గనుఁగవ లుసుముకొనుచు.
ధాత గూర్చుండె సృష్టి సంధాత యగుచు.

టీకా:

ఎప్పుడు = ఎప్పుడు; వేగున్ = తెల్లవారును; అంచున్ = అని; ఎదురుచూచున్ = ఎదురుచూచుచు; ఉండు = ఉన్నట్టి; మునులు = ఋషులు; డెందంబులన్ = మనసులు; ముదమున్ = సంతోషము; ఒందన్ = పొందగా; తెలివి = మెలకువరావడం; తోన్ = తోటి; ప్రక్క = పక్కనే; నిద్రించు = పడుకొన్న; భారతి = సరస్వతీదేవి; లేచి = లేచి; ఓరన్ = ఓరగా, కొంచముచాటుగా; పయ్యెదన్ = పమిటను; చక్కనొత్తికొనగ = సరిదిద్దుకోగా; మలినము = మట్టిగొట్టుకుపొయినది; ఐ = అయ్యి; పెనురేయి = ప్రళయపురాత్రి; మ్రక్కిన = మాసిపోయిన; తేజంబున్ = తేజస్సును; తొంటి = ఇంతకుపూర్వము; చందంబునన్ = వలెనె; తొంగలింపన్ = ప్రకాశించుతుండ; ప్రాణులన్ = జీవుల యొక్క; సంచిత = సంపాదించుకొన్న; భాగధేయంబులున్ = భాగ్యములు, కర్మఫలాలు; కన్నుల = కళ్ల; కొలకులన్ = కొనలందు; కానబడగ = కనిపించగా; అవయవంబులున్ = అవయవములను; కదలించి = కదుపుకొని.
ఆవులించి = ఆవులించి; నిదురన్ = నిద్రనుండి; తెప్పఱి = తెప్పరిల్లి; మేల్కాంచి = మేల్కొని; నీల్గి = నీలిగి; మలగి = కదలి; ఒడలు = వొళ్ళు; విఱుచుచున్ = విరుకొనుచు; కను = కళ్ళు; గవన్ = రెంటిని; ఉసుముకొనుచు = నులుముకొనుచు; ధాత = బ్రహ్మదేవుడు {ధాత - సమస్తమునుధరించువాడు, బ్రహ్మ}; కూర్చుండెన్ = కూర్చుండెను; సృష్టి = సృష్టిని; సంధాత = చేయువాడు; అగుచున్ = అగుచు.

భావము:

అలా ప్రళయకాలం ముగిస్తుండటంతో, ఎప్పుడు తెలవారుతుందో అనుకుంటూ ఎదురుచూస్తున్న మునుల హృదయాలు సంతోషించాయి. మైమరచి నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మ ప్రక్కన కూర్చుండి ఓరగా పైట సర్దుకుంది. ప్రళయకాలం మాసిపోయిన బ్రహ్మ తేజస్సు మరల మిసమిసలాడింది. ప్రాణులు సంపాదించిన పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులకు అగుపించాయి. అప్పుడు నిద్రలోవున్న బ్రహ్మదేవుడు అవయవాలను కదిలించాడు. ఆవులించి మేల్కొని నిక్కి. ఒడలు విరుచుకుంటూ కన్నులు తుడుచుకున్నాడు. తిరిగి సృష్టి చేయడానికి కూర్చున్నాడు.

8-736-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయ్యవసరంబున.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.

భావము:

ఆ సమయంలో . . . .

8-737-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వాసవారిఁ జంపి వాని చేఁ బడియున్న
వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి
నిదుర మాని యున్న నీరజాసనునకు
నిచ్చెఁ గరుణతోడ నీశ్వరుండు.

టీకా:

వాసవారిన్ = రాక్షసుని {వాసవారి - వాసవుని (ఇంద్రుని) అరి (శత్రువు), రాక్షసుడు}; చంపి = సంహరించి; వాని = అతని; చేబడి = అపహరింపబడి; ఉన్న = ఉన్నట్టి; వేద = వేదముల; కోటిన్ = సమూహముల; చిక్కున్ = చెర; విచ్చి = విడిపించి; తెచ్చి = తీసుకు వచ్చి; నిదురన్ = నిద్ర; మాని = లేచి; ఉన్న = ఉన్నట్టి; నీరజాసనున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; కరుణ = దయ; తోడన్ = తో; ఈశ్వరుండు = విష్ణుమూర్తి;

భావము:

భగవంతుడు ఇంద్రుడి శత్రువు అయిన హయగ్రీవుణ్ణి చంపేసి, వాడు అపహరించిన వేదాల చెర విడిపించాడు. వాటిని తెచ్చి నిద్ర లేచిన బ్రహ్మదేవుడికి దయతో పూర్వకంగా అప్పగించాడు.

8-738-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రుహనాభుని కొఱకై
తర్పణ మాచరించి త్యవ్రతుఁ డా
ధి బ్రతికి మను వయ్యెను;
జాక్షునిఁ గొలువ కెందు సంపదఁ గలదే?

టీకా:

జలరుహనాభుని = బ్రహ్మదేవుని; కొఱకై = కోసము; జలతర్పణమాచరించి = అర్ఘ్యముసమర్పించి; సత్యవ్రతుడు = సత్యవ్రతుడు; ఆ = ఆ; జలధిన్ = సముద్రమునుండి; బ్రతికి = బయటపడి; మనువు = మనువు; అయ్యెను = అయ్యెను; జలజాక్షుని = విష్ణుని; కొలువక = సేవించకపోతే; ఎందున్ = ఎక్కడైనా; సంపద = ఐశ్వర్యము; కలదే = ప్రాప్తించునా ప్రాప్తించదు.

భావము:

పద్మనాభుడు అయిన విష్ణుదేవుడికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించి ప్రళయ సముద్రంలోనుండి బయటపడి మనువు అయ్యాడు. ఆ పద్మాక్షుడిని విష్ణువును పూజించకుండా ఐశ్వర్యం ప్రాప్తించదు కదా!