పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కడలిలో నావను గాచుట

  •  
  •  
  •  

8-731-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లింపుము విన్నప మిదె
వేలుపు గమిఱేని నిన్ను వేఁడికొనియెదన్
నాలోని చిక్కు మానిచి
నీలోనికిఁ గొంచుఁ బొమ్ము నిఖిలాధీశా!"

టీకా:

ఆలింపుము = వినుము; విన్నపము = మనవి; ఇది = ఇదిగో; వేలుపు = దేవతల; గమి = సమూహమునకు; ఱేని = ప్రభువవు; నిన్నున్ = నిన్ను; వేడికొనియెదన్ = వేడుకొనెదను; నా = నా; లోని = అందలి; చిక్కున్ = సంకటములను; మానిచి = పోగొట్టి; నీ = నీ; లోని = లోపలి; కిన్ = కి; కొంచుబొమ్ము = తీసుకొనిపో; నిఖిలాధీశ = నారాయణా {నిఖిలాధీశుడు - నిఖిల (సమస్తమునకు) అధీశ (పై అధికారి), విష్ణువు}.

భావము:

ఓసర్వేశ్వరా! దేవధిదేవా! మా విన్నపాలు మన్నించమంటూ ప్రార్థిస్తున్నాను. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి చేర్చుకోమని వేడుకుంటున్నాను.