పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కడలిలో నావను గాచుట

  •  
  •  
  •  

8-729-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెలివై చుట్టమవై మనస్థ్సితుఁడవై చిన్మూర్తివై యాత్మవై
నై కోర్కులపంటవై విభుఁడవై ర్తిల్లు నిన్నొల్లకే
లువెంటంబడి లోక మక్కట; వృథా ద్ధాశమై పోయెడిన్
నిలువన్ నేర్చునె హేమరాశిఁ గనియున్ నిర్భాగ్యుఁ డంభశ్శయా!

టీకా:

చెలివి = స్నేహితుడవు; ఐ = అయ్యి; చుట్టమవు = బంధువవు; ఐ = అయ్యి; మనస్థ్సితుడవు = మనసునందు మెదలెడివాడవు; ఐ = అయ్యి; చిన్మూర్తివి = జ్ఞానస్వరూపివి; ఐ = అయ్యి; ఆత్మవు = ఆత్మవు; ఐ = అయ్యి; వలను = అండవు; ఐ = అయ్యి; కోర్కులన్ = కోరికలను; పంటవు = పండించెడివాడవు; ఐ = అయ్యి; విభుడవు = ప్రభువవు; ఐ = అయ్యి; వర్తిల్లు = ప్రవర్తిల్లెడి; నిన్నున్ = నిన్ను; ఒల్లక = అంగీకరించకుండగ; ఏ = ఏవో; పలువెంటన్ = పెక్కింటిపై పేరాశతో; లోకము = లోకులు; అక్కట = అయ్యో; వృథా = అనవసరముగ; బద్ధాశము = లోభములకు లొంగినవారు; ఐపోయెడిన్ = ఐపోయెదరు; నిలువన్ = నిలబెట్టుకొనుటను; నేర్చునే = దక్కించుకొనగలడా, లేడు; హేమ = బంగారపు; రాశిన్ = ముద్దను; కనియున్ = లభించినను; నిర్భాగ్యుడు = అదృష్టహీనుడు; అంభశ్శయా = మత్యావతారా {అంభశ్శయుడు - అంభస్ (నీట) శయుడు (పరుండు వాడు), మత్స్యావతారుడు, విష్ణువు}.

భావము:

నారాయణా! మత్య్యావతారా! నీవు స్నేహితుడుగా, బంధువుగా, జ్ఞానస్వరూపుడుగా, మానవుల మనస్సులోనే మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువు అయి కోరికలు పండిస్తావు. అటువంటి నిన్ను ఆనుసరించకుండా, లోకం ఏవేవో అనవసరపు పేరాశలకు బంధీ అయిపోయి పరుగులు పెడుతుంది. అదృష్టహీనుడు బంగారు రాశి లభించినా దక్కించుకోలేడు కదా.