పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కడలిలో నావను గాచుట

  •  
  •  
  •  

8-725-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నులు గల్గువాఁడు మఱి కాననివారికిఁ ద్రోవఁ జూపఁగాఁ
న్న తెఱంగు మూఢునకు న్మతిఁ దా గురుఁడౌట సూర్యుఁడే
న్నులుగాఁగ భూతములఁ గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతిజాడఁ జూపవే.

టీకా:

కన్నులున్ = కళ్ళు; కల్గు = ఉన్న; వాడు = వాడు; మఱి = అసలు; కానని = కనబడని; వారి = వారల; కిన్ = కు; త్రోవన్ = దారి; చూపగాన్ = చూపుటకు; చన్న = వెళ్ళెడి; తెఱంగున్ = విధముగ; మూఢున్ = మూర్ఖుని; కున్ = కి; సత్ = మంచి; మతిన్ = మనసుతో; తాన్ = అతను; గురుడు = గొప్పవాడు; ఔటన్ = అగుటచేత; సూర్యుడే = సూర్యుడే; కన్నులున్ = కళ్ళు; కాగన్ = అయ్యుండ; భూతములన్ = జీవులను; కాచుచున్ = కాపాడుతు; ఉండున్ = ఉండును; రమేశ = విష్ణుదేవా {రమేశుడు - రమ (లక్ష్మీదేవి) ఈశుడు (పతి), విష్ణువు}; మా = మా; కున్ = కు; ఉద్యన్నయమూర్తివి = ఉద్ధరించెడివాడవు; ఐ = అయ్యి; గురువవున్ = మార్గదర్శకుడవు; ఐ = అయ్యి; అల = అలానే; సత్గ+తుల = ఉన్నతదతులకు; జాడన్ = దారిని; చూపవే = చూపము.

భావము:

లక్ష్మీపతీ! హరీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తూ ఉంటావు. జ్ఞానం లేనివానికి దుర్భుద్ధి కలవానికి నీవే తండ్రివి. కాబట్టి కన్నులు ఉన్నవాడు కన్నులు లేనివాడికి దారి చూపిన విధంగా మమ్ములను ఉధ్దరించు. గురుడవై మాకు దారి చూపించు.