పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కడలిలో నావను గాచుట

  •  
  •  
  •  

8-721-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతకు మున్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచు నవసరంబున భక్త పరాధీనుం డగు హరిఁ దలంచుచు నుండ నారాయణ ప్రేరితయై యొక్క నావ వచ్చినం గనుంగొని.

టీకా:

అంత = దాని; కున్ = కి; మున్న = ముందు; సత్యవ్రతుండు = సత్యవ్రతుడు; మహార్ణవంబులు = మహాసముద్రములు; మహీవలయంబున్ = భూమండలమును; ముంచు = ముంచేసెడి; అవసరంబునన్ = సమయమునందు; భక్త = భక్తులకు; పరాధీనుండు = లొంగువాడు; అగు = అయిన; హరిన్ = విష్ణుమూర్తిని; తలంచుచున్ = స్మరించుచు; ఉండన్ = ఉండగా; నారాయణ = విష్ణునిచే; ప్రేరిత = ప్రేరేపింబడినది; ఐ = అయ్యి; ఒక్క = ఒక; నావ = ఓడ; వచ్చినన్ = రాగా; కనుంగొని = చూసి.

భావము:

సత్యవ్రతుడు ప్రళయ కాలం వచ్చి సముద్రజలాలు భూలోకాన్ని ముంచివేయడానికి ముందే భక్తులకు తోడునీడైన భగవంతుణ్ణి ధ్యానించుతున్న సమయంలో శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడకి వచ్చింది.