పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గురుపాఠీన విహరణము

  •  
  •  
  •  

8-719-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు లక్ష యోజనాయతం బయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి చొచ్చి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; లక్ష = లక్ష (1,00,000); యోజన = యోజనముల; ఆయతంబు = పొడవుకలది; అయిన = ఐన; పాఠీనంబు = కొరమీను, చేప; ఐ = రూపుడై; విశ్వంభరుండు = విష్ణుమూర్తి {విశ్వంభరుడు - విశ్వమునుభరించువాడు, విష్ణువు}; జలధిన్ = సముద్రమునందు {జలధి - జలమునకునిధి, కడలి}; చొచ్చి = ప్రవేశించి.

భావము:

అలా భగవంతుడు శ్రీమహావిష్ణువు లక్ష ఆమడల పొడవైన మత్స్య రూపం ధరించాడు. సముద్రంలో ప్రవేశించి . .. . .