పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కల్పాంత వర్ణన

  •  
  •  
  •  

8-717-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వేదంబులు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన, వాని జయింపవలసియు, మ్రానుదీఁగెల విత్తనంబుల పొత్తరలు పె న్నీట నాని చెడకుండ మనుపవలసియు నెల్ల కార్యంబులకుం గావలి యగునా పురుషోత్తముం డ ప్పెను రేయి చొరుదల యందు.

టీకా:

ఇట్లు = ఇలా; వేదంబులున్ = వేదములను; దొంగిలి = దొంగతనముచేసి; దొంగ = దొంగయైన; రక్కసుండు = రాక్షసుండు; మున్నీటన్ = సముద్రమునందు; మునింగినన్ = మునుగగా; వాని = అతనిని; జయింపవలసియున్ = జయించవలసి ఉండి; మ్రాను = వృక్షముల; తీగెల = తీవెల; విత్తనంబుల = విత్తనముల; పొత్తరంబులు = కట్టలు; పెన్నీటన్ = సముద్రమునందు; నాని = నానిపోయి; చెడకుండన్ = చెడిపోకుండ; మనుపవలసియున్ = కాపాడవలసి ఉండి; ఎల్ల = సమస్తమైన; కార్యంబుల్ = పనులు; కావలి = కాపాడెడివాడు; అగున్ = అయిన; ఆ = ఆ; పురుషోత్తముండు = విష్ణుమూర్తి; ఆ = ఆ; పెనురేయి = ప్రళయకాలపురాత్రి; చొరుదల = ప్రవేశము; అందు = లో.

భావము:

ఈ విధంగా వేదాలను అపహరించుకుపోయి సముద్రంలో మునిగిన ఆ రాక్షసదొంగ హయగ్రీవుడిని జయించడం కోసమూ; వృక్షాలూ, తీగలూ అన్నింటి విత్తనాలు సమస్తం సముద్రంలో తడసిపోయి పాడయిపోకుండా రక్షించడం కోసమూ; జగత్తులోని సమస్త కార్యములకు స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు ఆ ప్రళయకాల ఆరంభంలో మీనరూపం ధరించాడు. . .