పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కల్పాంత వర్ణన

  •  
  •  
  •  

8-716-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దువులుఁ దన చేఁ బడినం
దువుచుఁ బెన్ బయల నుండ శంకించి వడిం
దువుల ముదుకఁడు గూరుకఁ
దువుల తస్కరుఁడు చొచ్చె లనిధి కడుపున్.

టీకా:

చదువులున్ = వేదములు; తన = తన యొక్క; చేన్ = చేతిలో; పడినన్ = పడగా; చదువుచున్ = అధ్యయనముచేస్తూ; పెన్ = పూర్తిగా; బయలన్ = బహిఃప్రదేశమునందు; ఉండన్ = ఉండుటకు; శంకించి = బెదిరి; వడిన్ = శీఘ్రముగా; చదువులముదుకడు = బ్రహ్మదేవుడు {చదువులముదుకడు - చదువుల (వేదజ్ఞానమునందు) ముదుకడు (వృద్ధుడు), బ్రహ్మ}; కూరుకన్ = నిద్రించగా; చదువుల = వేదముల; తస్కరుడు = దొంగతనముచేసినవాడు; చొచ్చెన్ = దూరెను; జలనిధి = సముద్రపు; కడుపున్ = గర్భములోనికి.

భావము:

అలా వేదాలను చెరపట్టిన హయగ్రీవుడు వాటిని చదువసాగాడు. బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడిన అతడు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం గమనించి, వేగంగా సమద్రంలోకి వెళ్ళిపోయాడు.