పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : కల్పాంత వర్ణన

  •  
  •  
  •  

8-715-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లసి సొలసి నిదుర నందిన పరమేష్ఠి
ముఖము నందు వెడలె మొదలి శ్రుతులు
పహరించె నొక హగ్రీవుఁ డను దైత్య
టుఁడు; దొంగఁ దొడర రుల వశమె?

టీకా:

అలసి = అలసిపోయి; సొలసి = సోలిపోయి; నిదురన్ = నిద్రలో; అందిన = పడిన; పరమేష్టి = బ్రహ్మదేవుని; ముఖమున్ = ముఖము; అందున్ = నుండి; వెడలెన్ = వెలువడినవి; మొదలిశ్రుతులున్ = వేదములు; అపహరించెన్ = దొంగిలించెను; ఒక = ఒకానొక; హయగ్రీవుడు = హయగ్రీవుడు; అను = అనెడి; దైత్య = రాక్షస; భటుడున్ = వీరుడు; దొంగన్ = దొంగతనము; తొడరన్ = యత్నించుటకు; పరుల = ఇతరులకు; వశమె = సాధ్యమా కాదు.

భావము:

అలా బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు నిద్రపోయాడు. అతని ముఖాలనుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడు అనే రాక్షసవీరుడు వాటిని దొంగిలించాడు. ఆ హయగ్రీవుడికి తప్ప అలా దొంగతనం చేయడం ఇతరులకు సాధ్యం కాదు.